Skip to main content

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పట్ల మానవత్వం చాటిన విఎంఆర్డిఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్

.                     K.V.SHARMA EDITOR 
 విజయనగరం కి చెందిన బాలుడు బేబీ కృష్ణ (2 నెలలు)  ఎస్ ఎం ఎ టైప్-2 అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ బెంగుళూరు లో చికిత్స పొందుతున్న చిన్నారి చికిత్స నిమిత్తం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి స్పూర్తి తో తమ వంతు బాధ్యత గా వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు తన ఒక నెల వేతనం రూ.1 లక్ష రూపాయలు, వి ఎం ఆర్ డి ఎ ఉద్యోగులు తమ ఒక రోజు బేసిక్  వేతనం రూ.1.28 లక్షలు (మొత్తం రూ 2.28 లక్షలు) విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారి తాతయ్య దుర్గా రామచంద్రరావు మరియు అమ్మమ్మ సత్య కుమారి లకు  


చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు, మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్. తేజ్ భరత్ I.A.S., గారు కలిసి విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి సమక్షంలో స్వయంగా అందజేశారు. చిన్నారి కృష్ణ కి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. నిత్యం విధుల నిర్వహణలో బిజీగా ఉండే వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు, శ్రీ N తేజ్ భరత్ IAS గారు ఇతర వి ఎం ఆర్ డి ఎ ఉద్యోగులు కూడా చిన్నారి కృష్ణ ఆరోగ్యం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న దరిమిలా వైద్యం కోసం స్పందించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి అదితి గజపతి రాజు గారు కొనియాడారు.

Comments