శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ వర్మ
K.V.SHARMA EDITOR
సింహాచలం, జూన్ 08, 2026 అలహాబాద్ హైకోర్టు గౌరవనీయులైన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సిద్ధార్థ వర్మ సోమవారం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన గౌరవనీయులైన న్యాయమూర్తికి, ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు, సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు సాదరంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి జి.వి.ఎస్.కె. ప్రసాద్, పి.ఆర్.ఓ. నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం న్యాయమూర్తి గారు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న జస్టిస్ సిద్ధార్థ వర్మ గారికి, వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు స్వామివారి శేషవస్త్రంతో ఆయనను సత్కరించి, స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికగా స్వామివారి ఫోటోను అందజేశారు



Comments
Post a Comment