Skip to main content

గాయత్రి విద్యా పరిషత్‌లో ఘనంగా ముగిసిన మూడు రోజుల సాఫ్ట్ స్కిల్స్ వర్క్‌షాప్

.                 K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం:విశాఖ సందేశం :జూన్ 12:
స్థానిక గాయత్రి విద్యా పరిషత్ (GVP) డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన సాఫ్ట్ స్కిల్స్ వర్క్‌షాప్ ముగింపు వేడుకలు గాయత్రి విద్యా పరిషత్ ఎమ్.వి.పి సమావేశం మందిరంలో  శుక్రవారం ఘనంగా నిర్వహించబడ్డాయి.

కార్యక్రమం ప్రారంభంలో ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి గారు గత మూడు రోజులుగా నిర్వహించిన వర్క్‌షాప్ నివేదికను చదివి వినిపించారు. వర్క్‌షాప్‌లో నిర్వహించిన వివిధ సెషన్లు, విద్యార్థులు పొందిన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలను ఆమె వివరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎస్.వి. రామారావు సీనియర్ ఇంగ్లీష్ అధ్యాపకులు, కృష్ణ కాలేజ్, విశాఖపట్నంగారిని సభకు పరిచయం చేశారు.

ముఖ్య అతిథి డాక్టర్ ఎస్.వి. రామారావు, సీనియర్ ఇంగ్లీష్ అధ్యాపకులు కృష్ణ కాలేజ్ , మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం విద్యా ప్రతిభతోనే కాకుండా కమ్యూనికేషన్, నాయకత్వం, సమయపాలన, బృందస్ఫూర్తి వంటి సాఫ్ట్ స్కిల్స్‌ను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్ విజయాలకు ఈ నైపుణ్యాలు ఎంతగానో దోహదపడతాయని వివరించారు.

గాయత్రి విద్యా పరిషత్ సభ్యులు ఆచార్య ప్రగడ రాజగణపతి గారు మాట్లాడుతూ, గాయత్రి విద్యా పరిషత్ విలువలు, విద్యా ప్రమాణాలు మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సంస్థ అందిస్తున్న అవకాశాలను వివరించారు. సాఫ్ట్ స్కిల్స్ విద్యార్థుల జీవితంలో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో తెలియజేస్తూ, వాటిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

కళాశాల డైరెక్టర్ డి. గిరిధర్ గారు మాట్లాడుతూ, ఉద్యోగ అవకాశాలను పొందడంలో మరియు వృత్తిపరంగా ఉన్నత స్థానాలను చేరుకోవడంలో సాఫ్ట్ స్కిల్స్ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు నిరంతరం తమ వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి శ్రీ శంకర్ వ్యాఖ్యాతగా  వ్యవహరించారు. చివరగా శ్రీమతి వేదవతి గారు వందన సమర్పణ చేస్తూ వర్క్‌షాప్ విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్య అతిథులు, యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమం ముగింపులో వర్క్‌షాప్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ వేడుకలో కళాశాల అధ్యాపకులు డా సౌజన్య ,డా. శ్యామల, డాక్టర్ రాధిక, డా. ఇలాహి, డాక్టర్ అనిత మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Comments