Skip to main content

ఎమ్మెల్యే ఆనందరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్....

              SRINIVAS SPL Correspondant 


అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు  అయితాబత్తుల ఆనందరావు  జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్  ఎమ్మెల్యే ఆనందరావుకు  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ , ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుని  సాదరంగా కలిసి, శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు  భగవంతుని ఆశీస్సులతో, నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరిన్ని ఉన్నతమైన సేవలు అందించాలని మంత్రి  ఆకాంక్షించారు.

తమపై ఉన్న ప్రత్యేక ప్రేమాభిమానాలతో క్యాంపు కార్యాలయానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు  వాసంశెట్టి సుభాష్ కి ఎమ్మెల్యే  అయితాబత్తుల ఆనందరావు  తన హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొంగ శ్రీను, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments