Skip to main content

చంద్రబాబు వెన్నుపోటుకు ..రెండేళ్లు.... M కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్.. పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు.. నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన...

.               Srinivas SPL Correspondant 
అమలాపురం..విశాఖ సందేసం....రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో అమలాపురం ఏ.బి.సి.డి హోటల్ లో శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి ముఖ్య 


అతిధులుగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్,ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణరావు,మాజీ ఎంపీ చింతా అనురాధ హాజరై ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ రెండేళ్లు పూర్తవుతున్న సంక్షేమ కార్యక్రమా లన్నీ పక్కనపెట్టి కేవలం పబ్లిసిటీకే కూటమి ప్రభుత్వం తాపత్రయ పడుతుందని రాష్ట్రంలో రౌడీయి జం అత్యా నేరాలు రాజ్యమేలుతు న్నాయని ప్రజలకు జరగవలసిన మేలు ఏ కోచానా జరగట్లేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన కార్యక్రమాల్ని పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదని కూటమి ప్రభుత్వాన్ని పక్కనపెట్టి జగన్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు ఎప్పుడు డెప్పుడా అని ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనదైన శైలిలో కూటమి శ్రేణులపై మండి పడ్డారు.వచ్చే నెల నుండి పూర్తిగా అందుబాటులో ఉంటానని నియో జకవర్గ ప్రజలకు సహాయ సహకా ర కార్యక్రమాలకు సహకరిస్తానని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొ ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ప్రతి కార్యకర్త, నాయకుడు,అభిమాని కృషి చేయాలని పిలుపునిచ్చారు. చింతా అనురాధ మాట్లాడుతూ 


జగన్ పాలనలో సంక్షేమం,అభివృ ద్ధి రాష్ట్ర ప్రజలకు అందగా,చంద్ర బాబు పాలనలో సంక్షోభం రాజ్య మేలుతోందని అనురాధ ఎద్దేవా చేశారు.అమలాపురంలో “చంద్ర బాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పినిపే శ్రీకాంత్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.అనం తరం పార్టీ నాయకులు,కార్యకర్తల తో కలిసి నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జి బిషన్ ద్వారా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చోటుచేసుకున్న అవినీతి,ప్రజావ్యతిరేక నిర్ణయాలు, సంక్షేమ పథకాల కోతలను ప్రజల కు వివరించారు.కూటమి ప్రభు త్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలపై అక్రమ కేసులను,దాడుల ను తీవ్రంగా శ్రీకాంత్ ఖండించారు. ఆరోగ్యశాఖ వైఫల్యాలు,మహిళల పై పెరుగుతున్న దారుణాలు, దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు, నిరుద్యోగులను డీఎస్సీ పేరుతో మోసం చేయడం,విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం వంటి అంశాల పై తీవ్ర విమర్శలు చేశారు.ఎస్సీ విద్యార్థుల హాస్టళ్లలో సరైన సదు పాయాలు లేకపోవడం,రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజార డం,రైతులను మోసం చేయడం, ఇసుక–మట్టి దందాలను ప్రోత్స హించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.


రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన యువతను,రైతులను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చెల్లిబోయిన శ్రీనివాసరావు,కటకంశెట్టి ఆదిత్య, జిన్నూరు బాబి,సంసాని నాని, వంగా గిరిజ, జడ్పిటిసి పందిరి శ్రీహరి, ఒంటెద్దు వెంకన్న నాయుడు, కుడుపూడి భరత భూషణ్,బొడ్డు నాగేశ్వర రావు (బుజ్జి),మాజీ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి,రాజుల పూడి భాస్క రరావు,దాసరి డేవిడ్,దొంగ సుధా రాణి,వాసంశెట్టి శ్రీనివాస్,జిన్నూ రు వెంకటేశ్వరరావు,కరాటం ప్రవీణ్, పోతుమూడి కొండబాబు, రేవు శ్రీను,పొలమూరి బాలకృష్ణ తదితర నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments