జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు*
K.V.SHARMA EDITOR
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ రోజు అనగా 15-06-2026 న విశాఖ జిల్లాలో గల పలు సమస్యల పై జిల్లా కలెక్టర్ గారికి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్ల నిర్వహణ పై నిర్లక్ష్యం, బలోపేతం, కొత్త రైతు బజార్ల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన మరియు రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని కోరారు.
అనంతరం నగర పోలీస్ కమీషనర్ ను కలిసి సైబర్ నేరాల నియంత్రణ, బాధితుల నగదు రికవరీ ప్రక్రియలో సమర్థవంతమైన దర్యాప్తు, కేసు అధ్యయనం (Case Study), రికవరీ పెంపుదల మరియు ప్రత్యేక చర్యలు చేపట్టవలెనని వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనతా వారధి కో కన్వీనర్ మూలా వెంకటరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, దాడి పురుషోత్తం రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఇప్పిలి భాను మూర్తి, SS సంతోష్ కుమార్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




Comments
Post a Comment