విశాఖ పోర్ట్ ట్రస్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశురామ రాజు*
విశాఖపట్నం:విశాఖ సందేశం వార్తలు: ఈరోజు 17-06-2026 బుధవారం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్ శ్రీమతి కె. రోషిణి అపరంజి, IAS గారిని, అలాగే పోర్ట్ ట్రస్ట్ అథారిటీ సెక్రెటరీ శ్రీ ఎమ్. శంకర్ బాబు గారిని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామ రాజు గారు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలతో పాటు, పోర్ట్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విషయాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.ముఖ్యంగా వేసవి కాలంలో పోర్ట్ నుండి వచ్చే బొగ్గు, ఇతర కార్గో ధూళి గాలి తీవ్రత వల్ల నగరంలోకి ఎక్కువగా వస్తోందని, దీనివల్ల స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నారని పరశురామ రాజు గారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కాలుష్య నియంత్రణకు గానూ పోర్ట్ పరిసరాల్లో హై-జెట్ స్ప్రింకర్లు ఏర్పాటు చేయడం, గ్రీన్ బెల్ట్ (మొక్కల పెంపకం) పెంచడం, మెకనైజ్డ్ కోల్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని కోరారు.
బీజేపీ నేతలు విన్నవించిన సమస్యలపై డిప్యూటీ చైర్మన్ శ్రీమతి కె. రోషిణి అపరంజి గారు ఎంతో సానుకూలంగా స్పందించారు. నగర ప్రజల ఆరోగ్య రక్షణ తమకు ముఖ్యమని చెప్తూ, ధూళి నివారణకు గానూ పోర్ట్ పరిధిలో తక్షణమే తగిన రక్షణ చర్యలు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీరంగం ధనేశ్వర రావు, దాడి పురుషోత్తం రమేష్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు పొలిమేర శ్రీనివాసరావు, J దామోదర్ యాదవ్, బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ G రాకేష్, తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment