Skip to main content

బృహత్ ప్రణాళిక ప్రాధాన్యత రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలి * విమాశ్రయానికి వేగంగా చేరుకునేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి * VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్, IAS., * ప్రధాన కూడళ్లను అభివృద్ధి పరచాలి.

.                      K.V.SHARMA EDITOR 
భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే ప్రధాన రహదారుల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి చేయాలని VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్, IAS., అధికారులను ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే నెలలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ నెల 25 తేదీ నాటికి బృహత్ ప్రణాళిక రహదారులు వాడుకలోకి తీసుకొనివచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం VMRDA సమావేశ మందిరంలో ప్రణాళిక, ఇంజనీరింగ్, జీవీఎంసీ, ఎన్ హెచ్ విభాగం, రహదారుల, భవనాల శాఖ, GMR కు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల నిర్మాణ మార్గాల్లో ప్రధానంగా జాతీయ రహదారులకు కనెక్ట్ అయ్యే కూడళ్ల అభివృద్ధి మరియు మార్గాలను తెలియజేసే సూచికలను ఏర్పాటు చేయాలని, నగరం నుంచి ఎయిర్ పోర్టు కు ఈ ప్రధాన రహదారుల ను ఉపయోగించి వెళ్ళే విమాన ప్రయాణికులు ఎలాంటి అవరోధాలు లేకుండా అనుకున్న సమయానికి చేరుకునేలా రహదారులపై స్పష్టంగా కనిపించేలా సైన్ బోర్డ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా విమాశ్రయానికి వేగవంతంగా చేరుకునేలా రోడ్ మ్యాప్ లను సిద్ధం చేయాలని, వాటి గురించి ప్రయాణికులు తెలుసుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న రహదారి నిర్మాణ పనులపై అంశాల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో  అడిషనల్ కమిషనర్ శ్రీమతి దాట్ల కీర్తి, ప్రధాన ఇంజనీర్ శ్రీ వినయ్ కుమార్, OSD కృష్ణా నాయక్, పర్యవేక్షక ఇంజనీర్లు మధుసూదన రావు, శ్రీ రాంబాబు, ముఖ్య ప్రణాళిక అధికారిణి  శ్రీమతి దివ్య లత , కార్యనిర్వహక ఇంజనీర్లు శ్రీ సుధీర్, శ్రీ దుర్గా ప్రసాద్,  శ్రీ రామరాజు , ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments