జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 01.07.2026
ఈరోజు అనగా తేదీ 01.07.2026 న డాక్టర్స్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,
విశాఖపట్నం వారిని మరియు మిగతా వైధ్యాదికారులందరినీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి యొక్క అనుభవాలని పంచుకుని దుశ్శాలువతో సన్మానించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలియచేసారు. చాలామంది వక్తలు మాట్లాడిన తదుపరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి,జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ 1983 నుండి ఎం.బి.బి.ఎస్ బ్యాచ్ అని మరియు తదుపరి పిడియాట్రిక్స్ చేయడం జరిగిందని డాక్టర్ వృత్తి అనేది రోగులకు మరియు డాక్టర్ కు ఉండే సంబంధం దైవానుగ్రహమని,
ఈ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ రాకమునుపు వైద్యాధికారిగా చాలామంది రోగులకు సేవలు అందించడం జరిగిందని తెలియచేసారు. కోవిడ్ సమయంలో కూడా చాలామందికి చికిత్స అందించడం లో డాక్టర్స్ పాత్ర మరువలేనిదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



Comments
Post a Comment