Skip to main content

పత్రిక ప్రకటన – 02 జూలై 27 విశాఖపట్నం విశాఖపట్నం మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్డు లో గల పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె.రాజు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం సమన్వయకర్తలు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసన సభ్యులు, నియోజక వర్గం పరిశీలకులు , పి.ఎ.సి సభ్యులు , సి.ఇ.సి సభ్యులు , ఎస్.ఇ.సి సభ్యులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ కమిటి అధికార ప్రతినిదులు, సంయుక్త కార్యదర్శులు , రాష్ట్ర పార్టీ అనుబంద విభాగాల అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అనుబంద విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సమావేశమ జరిగింది .


ఈ సందర్భంగా కెకె రాజు మాట్లుడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతం, కమిటీల నిర్మాణం, సభ్యుల వెరిఫికేషన్, అలాగే ప్రజా సమస్యలపై చేపట్టనున్న ఉద్యమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ, పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలంటే కమిటీల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడం అత్యంత అవసరమని అన్నారు. ప్రతి కమిటీ సమర్థవంతంగా పనిచేసే విధంగా అంకితభావం కలిగిన కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంటేనే ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు మరింత ప్రభావవంతంగా చేరుతాయని పేర్కొన్నారు. సభ్యుల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సభ్యుడి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్రియాశీల కార్యకర్తలను గుర్తిస్తూ పార్టీ సభ్యత్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భవిష్యత్ పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణలో ఈ వెరిఫికేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. యువజన విభాగం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఉద్యమం ఉండాలని, నిరుద్యోగ యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల మధ్యకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, యువజన విభాగాలు పార్టీకి వెన్నెముకలాంటివని పేర్కొన్న కెకె రాజు, యువతే పార్టీ భవిష్యత్తును ముందుకు నడిపించే శక్తి అని అన్నారు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం పోరాడాలని సూచించారు. పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీ అభివృద్ధికి బలమైన పునాది అవుతారని పేర్కొన్నారు. ప్రతి మండలం, ప్రతి డివిజన్, ప్రతి వార్డు స్థాయిలో యువజన మరియు విద్యార్థి విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ ప్రకటించే అన్ని కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశం లో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, శాసన మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి, మాజీ మంత్రి వర్యులు పసుపులేటి బాల రాజు, మాజీ శాసన సభ్యులు తైనాల విజయ కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకట రామయ్య,పార్టీ పర్యవేక్షకులు గుడిమెట్ల రవి రెడ్డి,  పార్టీ నాయుకులు జహీర్ అహ్మద్, చింతకాయల సన్యాసి పాత్రుడు, వీసం రామ కృష్ణ, పెడాడ రమణి కుమారి, కోల గురువులు, యెడ్డు దేముడు, జియ్యాని శ్రీధర్, కొట్టమురి సతీష్ , బాణాల శ్రీనివాసరావు, పిన్నమరాజు సతీష్ వర్మ, కొండా రాజీవ్ గాంధీ, పరిసా వేంకట నారాయణ, తాడి జగన్నాధ రెడ్డి, కిరణ్ రాజు, కోరుకొండ వెంకట రత్న స్వాతి, పల్లా దుర్గారావు, గుడ్ల వెంకట రమణి రెడ్డి, గొందేశి మహేశ్వర రెడ్డి, లింగం శ్రీనివాస్, ప్రసాద్ రాజు, బొల్లవరపు జాన్ వెస్లీ, పెర్ల విజయ చందర్, గండ్రాజు వెంకట రవిరాజు, చెన్నా జానకి రామ్, జీలకర్ర నాగేంద్ర , ద్రోణంరాజు శ్రీ వాస్తవా, సేనాపతి అప్పారావు, అంబటి నాగ వినాయక శైలేష్, పివి సురేష్, తుమ్మలూరు జగదేష్ రెడ్డి, వూరుకూటి రామ చంద్రరావు (చందు), సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, కటికల కల్పన, మేడి బాజీ నాయుడు, రాయపురెడ్డి అనిల్ కుమార్, కర్రి రామా రెడ్డి, శ్రీదేవి వర్మ పెనంత్స, వంకాయల మారుతీ ప్రసాద్, వడ్డాది దీలిప్ కుమార్, సకలభక్తుల ప్రసాద్ రావు, బోండా ఉమా మహేశ్వర రావు, మనోజ్ కుమార్ గొడబా, చిక్కాల సత్యనారాయణ, గొలగాని శ్రీనివాస్, మువ్వల సురేష్ , పిల్ల కన్న బాబు, గానగల్ల రామరాజు తదితరాలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...