జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 03.07.2026
విశాఖపట్నం -ఈరోజు అనగా తేదీ 03.07.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు కొబ్బరితోట పట్టణ ఆరోగ్యకేంద్రము భూపేష్ నగర్ ను సచివాలయం పరిదిలో సందర్శించి డెంగ్యూ హాట్ స్పాట్ లను పరిశీలించి అక్కడ ప్రజలకు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని, ఇళ్ళల్లో ఉండేటటువంటి ఫ్రిడ్జ్ లలో, ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండే నీటి నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మరియు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరూ ఫ్రైడే-డ్రైడే పాటించాలని తెలియచేసారు.
తదుపరి ఇ.హెచ్.ఆర్., అభ ఐడి రిజిస్ట్రేషన్, ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట పబ్లిక్ పెర్సప్షన్, కె.పి.ఐ. ఇండికేటర్స్, ఆర్.బి.ఎస్.కె సేవలు, ఓపి, ఐపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, మందులు లభ్యత, ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. పట్టణ ఆరోగ్య కేంద్ర పరిసర ప్రాంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్శనలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు డా.హాలీమా పర్వీన్, జిల్లా మలేరియా అధికారి శ్రీ వరప్రసాద రెడ్డి వారు, జివిఎంసి బయాలజిస్ట్ శ్రీ పి.సాంబమూర్తి, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ బి.నాగభూషణం వారు, మలేరియా సిబ్బంది, జివిఎంసి సిబ్బంది మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment