Skip to main content

ఆగస్టు 1.. భోగాపురం ముహూర్తం ఫిక్స్..!!* - ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆగస్ట్ 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం. - ఉత్తరాంధ్ర.. ఉత్తమాంధ్ర అయ్యేందుకు ముహూర్తం ఆసన్నమైందన్న రామ్మోహన్ నాయుడు.. - గొప్ప వేడుక విజయవంతం అయ్యేలా రాష్ట్ర ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరిన రామ్మోహన్ నాయుడు..

.                K.V.SHARMA EDITOR 
జూలై 18 : విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణ దశను పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. 


ఆగస్టు ఒకటవ తేదీ.. ఉత్తరాంధ్ర.. ఉత్తమాంధ్రగా నిలిచేందుకు ముహూర్తం ఆసన్నమైందని రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఓ గొప్ప క్షణం ఆవిష్కృతం అవుతున్న నేపథ్యంలో.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా తమ మద్దతును ఈ వేడుకకు అందివ్వాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ప్రధాని పర్యటన తాలుక పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

Comments