Skip to main content

ప్రకటన-1 జాతీయ మున్సిపల్ అకౌంటింగ్ మాన్యువల్ (NMAM–2.0) ఫీల్డ్ అసెస్‌మెంట్‌లో భాగంగా జీవీఎంసీలో GASAB ఉన్నతస్థాయి సమీక్ష. * CAG కార్యాలయానికి చెందిన GASAB అడ్వైజర్ & చైర్‌పర్సన్ శ్రీమతి అల్కా రెహానీ భరద్వాజ్, IA&AS అధ్యక్షతన సమీక్ష. * NMAM–2.0 రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, డిజిటల్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలపై సమగ్ర చర్చ. * జీవీఎంసీలో అమలవుతున్న డిజిటల్ అకౌంటింగ్, ERP వ్యవస్థలు, ఆర్థిక నిర్వహణ విధానాలపై క్షేత్రస్థాయి అంచనా. * 40 అంశాలతో కూడిన Accounting & Digital Maturity Assessment ప్రశ్నావళికి జీవీఎంసీ కమిషనర్ సమగ్ర వివరణ.

 

                     K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం, జూలై 22: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా  (Comptroller and Auditor General of India – CAG) కార్యాలయానికి చెందిన గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అడ్వైజరీ బోర్డ్ ( Government Accounting Standards Advisory Board-GASAB) ఆధ్వర్యంలో రూపొందిస్తున్న నేషనల్ మున్సిపల్ అకౌంటింగ్ మ్యాన్యువల్  (National Municipal Accounting Manual -NMAM–2.0) కోసం నిర్వహిస్తున్న ఫీల్డ్ అసెస్మెంట్ - ఆబ్జెక్టివ్స్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ది స్టేట్ (Field Assessment – Objectives, Process and Expected Inputs from the State )కార్యక్రమంలో భాగంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ప్రధాన కార్యాలయంలో GASAB అడ్వైజర్ & చైర్‌పర్సన్  అల్కా రెహానీ భరద్వాజ్, IA&AS అధ్యక్షతన, GASAB ప్రిన్సిపల్ డైరెక్టర్ డా. జయనాయక్, IDAS లతో  కలసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడిందని పేర్కొన్నారు.


ఈ సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ (CDMA) సంపత్ కుమార్ పాల్గొనగా లోకల్ ఫండ్ ఆడిట్ శాఖ అధికారులు, పట్టణాభివృద్ధి శాఖ ఆర్థిక, ఐటీ అధికారులు, GASAB అధికారులు, జనాగ్రహ (Janaagraha), ఈ-గవ్ ఫౌండేషన్ (eGov Foundation) ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో GASAB అడ్వైజర్ అండ్ చైర్ పర్సన్ అల్కా రెహానీ భరద్వాజ్, IA&AS మాట్లాడుతూ NMAM–2.0 ఫీల్డ్ అసెస్‌మెంట్ లక్ష్యాలు, అమలు ప్రక్రియ, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆశిస్తున్న సూచనలు, పట్టణ స్థానిక సంస్థల్లో అమలవుతున్న అకౌంటింగ్ విధానాలు, డిజిటల్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు, అకౌంటింగ్ ప్రమాణాలు, డేటా ఇంటర్‌ఆపరబిలిటీ, సాంకేతిక సామర్థ్యాలపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపడుతున్నట్లు వివరించారు. ఈ అధ్యయనం ద్వారా దేశవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు అనువైన ఆధునిక National Municipal Accounting Manual (NMAM–2.0) రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.దేశవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో అమలవుతున్న ఉత్తమ అకౌంటింగ్ విధానాలు, డిజిటల్ సంస్కరణలు, ఆర్థిక నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేసి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా NMAM–2.0ను రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థల నుంచి లభించే సూచనలు ఈ ప్రక్రియలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జీవీఎంసీ, యలమంచిలి ,పాలకొండలో ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. అనంతరం Accounting and Digital Maturity Assessment for NMAM–2.0" 40 అంశాలతో  రూపొందించిన ప్రశ్నావళికి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నుండి సమగ్ర సమాధానాలను తెలుసుకున్నారు.


ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, పారదర్శక అకౌంటింగ్ విధానాల అమలుకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జాతీయ ప్రమాణాల రూపకల్పనలో రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

అనంతరం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్  సంపత్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఆధునిక డిజిటల్ ఆర్థిక నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేస్తోందని, NMAM–2.0 అమలుకు అవసరమైన అన్ని సూచనలు, సహకారం అందజేస్తామని తెలిపారు.


ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ జీవీఎంసీ 685 స్క్వేర్ కిలోమీటర్లు పరిధి  కలిగి ఉందని , పది జోన్లలో 98 వార్డులలో 25 లక్షలు పైగా ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ అన్ని మౌలిక సదుపాయాలను జీవీఎంసీ కల్పిస్తుందని చైర్ పర్సన్ కు తెలిపారు. జీవీఎంసీలో అమలవుతున్న e-Municipal ERP, DEABAS-CGG ఆధారిత అకౌంటింగ్ వ్యవస్థ, బడ్జెట్ నిర్వహణ, రెవెన్యూ అకౌంటింగ్, వ్యయ నిర్వహణ, ఆస్తుల నిర్వహణ, డిజిటల్ చెల్లింపులు, వార్షిక ఆర్థిక నివేదికల తయారీ, డిజిటల్ సేవలు, ఆర్థిక పారదర్శకత, డిజిటల్ పరిపక్వత అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జీవీఎంసీలో అమలవుతున్న డిజిటల్ అకౌంటింగ్, ERP ఆధారిత ఆర్థిక నిర్వహణ, డిజిటల్ సేవలు, పారదర్శకత, సాంకేతిక వినియోగం, జీవీఎంసీలు రెవెన్యూ మరియు ఎక్స్పెండిచర్ స్ట్రీమ్స్, టౌన్ ప్లానింగ్ ఏపీ డి పి ఎం ఎస్ వ్యవస్థ, వాటర్ సప్లై ప్లానింగ్ , నగరంలో ఓపెన్ స్పేస్ లు పార్కులుగా అభివృద్ధి, గ్రీనరీ డెవలప్మెంట్ తదితర అంశాలను వివరించారు. జీవీఎంసీ తరఫున 40 అంశాలతో కూడిన "Accounting and Digital Maturity Assessment for NMAM–2.0" ప్రశ్నావళికి సమగ్ర సమాధానాలు అందించారు.జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ అధ్యయనంలో జీవీఎంసీ భాగస్వామ్యం కావడం సంతోషదాయకమని , NMAM–2.0 అమలుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు.

సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ (ఫైనాన్స్) ఎస్.ఎస్. వర్మ, వ్యయ పరిశీలకులు సి. వాసుదేవరెడ్డి, జేడీ–అమృత్ డి. విజయభారతి, చార్టర్డ్ అకౌంటెంట్ సత్యనారాయణ, GASAB అధికారులు, జనాగ్రహ, ఈ-గవ్ ఫౌండేషన్ ప్రతినిధులు, పట్టణాభివృద్ధి శాఖ ఆర్థిక, ఐటీ అధికారులు, జీవీఎంసీ ఆర్థిక, ఐటీ విభాగాల అధికారులు, ఇతర జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి,జివిఎంసి

Comments