Skip to main content

జర్నలిస్టుల డిమాండ్స్ డే విజయవంతం* *విశాఖలో కదం తొక్కిన పాత్రికేయులు* *11 పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం* *ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ*


విశాఖ కలెక్టర్ కార్యాలయం జూలై 31 రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ శుక్రవారం విశాఖలో నిర్వహించిన డిమాండ్స్ డే కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది.. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడుకు 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జర్నలిస్టులు సమర్పించడం జరిగింది.. ఈ సందర్భంగా డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ జర్నలిస్టులు అందించిన వినతి పత్రాన్ని తాము ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు.. జర్నలిస్టులు సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ఏజే..) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణలు మాట్లాడుతూతమ రాష్ట్ర కార్యవర్గం పిలుపుమేరకు అన్ని జిల్లాల్లో డిమాండ్స్ డేను విజయవంతంగా నిర్వహించా మన్నారు.. పెద్ద ఎత్తున జర్నలిస్టుల హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని తమ డిమాండ్ల పరిష్కరించాలని నినాదాలు చేయడం జరిగిందన్నారు.. అన్ని వర్గాలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని తాము కోరుతున్నామన్నారు.. ఇళ్ల స్థలాలు.. పెన్షన్ వంటి డిమాండ్స్ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయన్నారు.. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని.. ప్రమాద బీమా పునరుద్ధరించాలని.. సి ఆర్ రాఘవాచారి ప్రెస్ అకాడమీనీ 

బలోపేతం చేయాలని.. అన్ని కమిటీలు తక్షణమే పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు.. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ..బ్రాడ్ కాస్ట్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ఆర్గనైజింగ్ సెక్రెటరీ ధవలేశ్వరపు రవి కుమార్, జాయింట్ సెక్రెటరీ జి రాంబాబు, మధు,కార్యవర్గ సభ్యులు ఎంవీ రాజశేఖర్, జి ఆర్ ఎస్ రమేష్, నెల రాజు, ఉపాధ్యక్షులు పిల్ల నగేష్ బాబు 

బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు, కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అధ్యక్షులు వి ఎస్ జగన్మోహన్, జాయింట్ సెక్రెటరీ బొబ్బర ప్రసాద్, కార్యవర్గ సభ్యులు అరుణ్ భాస్కర్ (హరి).జర్నలిస్ట్ లు గౌతమ్, వినయ్, పక్కి రమేష్, రమణ, సింహాద్రి, విజయ్ కుమార్, రాజ్ కుమార్, బన్ని పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు..

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...