ఈ రోజు అనగా 11.07.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు మలేరియా, డెంగు ప్రబలే సీజన్ ప్రారంభం కావడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. డెంగీ వ్యతిరేక మాసోత్సవము సందర్భంగా ప్రజల్లో కీటక జనిత వ్యాధులు పై అవగాహన ర్యాలీని అసిస్టెంట్ మలేరియా అధికారి బి. నాగభూషణరావు ఆధ్వర్యంలో శనివారం డిఎంహెచ్వో కార్యాలయం వద్ద జండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ దోమల ఉత్పత్తి నివారణకు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను గుర్తించి తొలగించాలన్నారు. ఈ ప్రక్రియను ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రకారంగా నిర్వహించాలని సూచించారు. ఇంటింటి సందర్శన తప్పనిసరిగా చేయాలని క్షేత్రస్థాయిలో జ్వర పీడితులను గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం మంగళవారం విధిగా నిర్వహించాలని అన్నారు. దోమలు ఉత్పత్తి నివారణకు జీవీఎంసీ ఏఎల్ఓ బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ర్యాలీగా dmho కార్యాలయం నుండి సత్యం జంక్షన్ మీదుగా రామ టాకీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో DPMO డా: ఉమావతి, DIO డా: లూసి, PO NCD డా: హారిక,WHO డా సమత, డెమో శ్రీ.బి.నాగేశ్వరరావు,DSO డా: ప్రదీప్. డా: శాంతి, జిల్లా epidimologist, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయ సిబ్బంది, మలేరియా విభాగం సూపర్వైజర్లు ఆరోగ్య కార్యకర్తలు,ఆశాలు, తదితరులు పాల్గొన్నారు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment