Skip to main content

జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది: 11.07.2026

.                K.V.SHARMA EDITOR 
ఈ రోజు అనగా 11.07.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు ప్రపంచ జనాబా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంబించారు. ఈ ర్యాలీ సత్యం జంక్షన్ మీదుగా మరలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం వరకు జరిగింది. 




డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడతూ ఈ సంవత్సరం నినాదం “పిల్లల మధ్య ఎడం పాటిద్దాం-ఆరోగ్యకరమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం”, అని నినాదం చేస్తూ ర్యాలీ కొనసాగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు గారు మాట్లాడుతూ పట్టణ మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము లలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగానే కాకుండా మిగతా రోజులలో కూడా కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్దతులైనటు వంటి పి.పి.ఐ.యు.సి.డి., నోటిమాత్రలు, అంతర ఇంజక్షన్లు, నిరోద్ లు, గురించి ప్రజలకు చైతన్య పరచాలని తెలియచేసారు. తదుపరి జిల్లా విస్తరణ మరియు ప్రచారణ అధికారి శ్రీ బి.నాగేశ్వర వారు వారు మాట్లాడుతూ టీనేజ్ లో గర్భం దాల్చకుండా చూసుకోవాలని, వివాహ వయస్సు 20 సం”లు దాటిన తర్వాత పెళ్ళైన వారు కుటుంబ నియంత్రణ, తాత్కాలిక పద్దతులు పాటించాలని తెలియచేసారు. తదుపరి ఇన్చార్జ్ జిల్లా గణాంక అధికారి శ్రీ పి.రమేష్ వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పోషకాహారం మరియు ప్రణాళిక ప్రకారం వాక్సినేషన్ చేసుకోవాలని, మరియు తాత్కాలిక పద్దతులైన గర్భ నిరోధక మాత్రలు, పి.పి.ఐ.యు.సి.డి. పద్దతులు వాడాలని తెలియచేసారు. తదుపరి జిల్లా ప్రోగ్రాం అధికారులు  మరియు పారామెడికల్ సిబ్బంది సమక్షంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారందరూ లక్కీ డిప్ నిర్వహించారు. ఈ లక్కీ డిప్ లో ఉత్తమ గైనకాలజిస్ట్ గా డా.కె.హారిక, కింగ్ జార్జ్ హాస్పిటల్, రూ.8,000/- ఉత్తమ వేసక్టమి సర్జన్ గా 


డా.శ్రీధర్, కింగ్ జార్జ్ హాస్పిటల్, రూ.7,000/-లు  ఎంపిక కాగా మరియు ముగ్గురు కంటే ఎక్కువ పిల్లలున్న తల్లితండ్రులు శ్రీమతి ఉప్పాడ ఉమాదేవి, కె.ములగపాడు, శ్రీమతి మామిడి మంగ, గంభీరం, శ్రీమతి వరపుల పైడిరాజు దేవి, కుసులవాడ వారు రూ.5,000/-లు, తాత్కాలిక పద్దతులైనటువంటి పి.పి.ఐ.యు.సి.డి. కి ఇద్దరు, అంతర కు ఇద్దరు, ఎన్.ఎస్.వి. కి ఇద్దరు, రూ.5,000/-లు, ఆనందపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంనకు చెందిన ఉత్తమ ఏ.ఎన్.ఎం. శ్రీమతి భాగ్యలక్ష్మి, రూ.2,500/-లు, ఉత్తమ ఎం.ఎల్.హెచ్.పి. సౌందర్య, ఆర్.ఎం.ఎన్.సి. కౌన్సిలర్ పి.వనిత, కింగ్ జార్జ్ హాస్పిటల్, పి.వరలక్ష్మి, ఆశా కార్యకర్త రూ.2,500/-లు నగదు బహుమతి పొందారు.       


ఈ కార్యక్రమంలో డా.లూసీ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి, డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ., శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో వారు, డా.హారిక, ఆర్.బి.ఎస్.కె. జిల్లా సమన్వయకర్త, డా.ఎన్.వి.సమత, విమెన్ హెల్త్ అధికారి, జిల్లా ప్రోగ్రాం అధికారులు, శ్రీమతి ఎం.సత్యవతి, డి.పి.హెచ్.ఎన్.ఒ., శ్రీ వర్ధన్, డి.ఎస్.ఒ., శ్రీ శశి భూషణ్, DPO-NHM, ఎపిడిమాలజిస్ట్, వైద్య ఆరోగ్య కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్ధినులు మరియు శ్రీ నాగభూషణం, ఎ.ఎం.ఒ. పాల్గొన్నారు.          

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

                           విశాఖపట్నం


Comments