సర్వాంగ సుందరంగా ముస్తాబైన మంగళగిరి రైల్వే స్టేషన్* *రూ 12.56 కోట్లతో ఆధునికీకరణ పూర్తి* *రేపు వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం* *కార్యక్రమానికి విచ్చేయనున్న మంత్రి నారా లోకేష్* *మంగళగిరి:* మంగళగిరి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ కోస్ట్ రైల్వే, గుంటూరు డివిజన్ పరిధిలోని మంగళగిరి రైల్వే స్టేషన్ ను రూ.12.56 కోట్లతో ఆధునికీకరణ పూర్తి చేశారు. శుక్రవారం ఈ స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. ఎం ఎస్ జి -4 కేటగిరి కి చెందిన ఈ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించారు. *కార్పొరేట్ లుక్‌లో కొత్త భవనం.. వీఐపీ వసతులు!* ఈ ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా పాత స్టేషన్ భవనానికి సరికొత్త రూపునివ్వడంతో పాటు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో ప్రవేశ మార్గాన్ని (సెకండ్ ఎంట్రీ) నిర్మించారు. సరికొత్త బుకింగ్ కౌంటర్లు, డిజిటల్ సూచికలు, అత్యాధునిక వెయిటింగ్ హాళ్లు, వీఐపీ లాంజ్ వంటి సదుపాయాలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. స్టేషన్ ముఖద్వారాన్ని ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌తో తీర్చిదిద్దారు. ప్లాట్‌ఫారమ్‌ల ఆధునీకరణ, మెరుగైన మరుగుదొడ్లు, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు, స్పష్టమైన సైనేజీ బోర్డులతో స్టేషన్ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంది.
మంగళగిరి:*మంగళగిరి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ కోస్ట్ రైల్వే, గుంటూరు డివిజన్ పరిధిలోని మంగళగిరి రైల్వే స్టేషన్ ను రూ.12.56 కోట్లతో ఆధునికీకరణ పూర్తి చేశారు. శుక్రవారం ఈ స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.
ఎం ఎస్ జి -4 కేటగిరి కి చెందిన ఈ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించారు.
*కార్పొరేట్ లుక్‌లో కొత్త భవనం.. వీఐపీ వసతులు!*
ఈ ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా పాత స్టేషన్ భవనానికి సరికొత్త రూపునివ్వడంతో పాటు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో ప్రవేశ మార్గాన్ని (సెకండ్ ఎంట్రీ) నిర్మించారు. సరికొత్త బుకింగ్ కౌంటర్లు, డిజిటల్ సూచికలు, అత్యాధునిక వెయిటింగ్ హాళ్లు, వీఐపీ లాంజ్ వంటి సదుపాయాలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. స్టేషన్ ముఖద్వారాన్ని ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌తో తీర్చిదిద్దారు. ప్లాట్‌ఫారమ్‌ల ఆధునీకరణ, మెరుగైన మరుగుదొడ్లు, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు, స్పష్టమైన సైనేజీ బోర్డులతో స్టేషన్ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంది.
*దివ్యాంగులకు పెద్దపీట..*
స్థానిక సంస్కృతికి అద్దం పట్టే కళాకృతులు
ప్రయాణికులందరికీ ప్రయాణం సులభతరం చేసేలా ప్లాట్‌ఫారమ్ 1, 4 లపై కొత్త షెల్టర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రెండు లిఫ్టులు, ర్యాంపులు, టాక్టైల్ పాత్‌వేలు (నడిచే మార్గాలు) మరియు ప్రత్యేక శౌచాలయాలను నిర్మించారు. విశాలమైన పార్కింగ్ ఏరియా, పాదచారుల కోసం ప్రత్యేక ట్రాక్‌లు, రాత్రి వేళల్లో వెలుగులు విరజిమ్మేలా వీధి దీపాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు, మంగళగిరి ప్రాంతీయ వైభవాన్ని, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా అద్భుతమైన పెయింటింగ్స్, కళాకృతులతో గోడలను అలంకరించారు.
రాజధాని అమరావతి ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంటూ సేవలందిస్తున్న ఏకైక ఎన్ఎస్ జి -4 కేటగిరీ స్టేషన్‌గా మంగళగిరి ఎంతో కీలకమైనదని రైల్వే అధికారులు తెలిపారు. తాజా మేకోవర్ ద్వారా ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతి లభించడమే కాకుండా, రైల్వే సేవల సామర్థ్యం కూడా మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment