Skip to main content

విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 129 జయంతి వేడుకలు మరియు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలి...


మన్యం వీరుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు వివేకానంద సంస్థ వారు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.C.M.A. జహీర్ అహ్మద్  అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. 


ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, సాయిద పోరాటంతోనే భారతదేశానికి స్వాతంత్ర్యం లభిస్తుందని బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి, అతి చిన్న వయసులోనే 27 సంవత్సరాలకు ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి.27 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వారి అకృత్యాలు దురాగతాలను ఎదిరించాడు, అల్లూరి పోరాటంతో బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయింది. ఊరికి అల్లూరి పేరు పెట్టడం, భోగాపురం ఎయిర్ పోర్ట్ కి కి అల్లూరి నామకరణ అభినందనీయమని, 2002లో  కేంద్రం అనుమతి ఉండి కూడా, అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్ట లేదని,


ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పార్లమెంట్లో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించాలని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం.  విద్యార్థులకు పాఠ్య అంశాల్లో భాగంగా ఇలాంటి వీరుల చరిత్రలను విద్యార్థులకు బోధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, మరియు సంస్థ సభ్యులు సత్తిబాబు, అప్పలకొండ, మరియు T.కృష్ణ  పాల్గొన్నారు.

Comments