Skip to main content

14న ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ర్ట కార్యవర్గ సమావేశం* *ఇళ్ల స్థలాలు... పెన్షన్లు అజెండాగా తీర్మాణాలు* *ప్రభుత్వం దృష్టికి పెండింగ్ సమస్యలు*


విశాఖపట్నం, జూలై 07ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ర్ట కార్యవర్గ సమావేశం ఈనెల 14న విజయవాడలో నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ ఏజె) గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణలు తెలిపారు. మంగళవారం  ఇక్కడ అక్కయ్యపాలెం జంక్షన్  వద్ద ఒక ప్రయివేట్ హోటల్ లో ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ , బ్రాడ్ కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన పలు అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని గంట్ల శ్రీనుబాబు, నారాయణలు వివరించారు. ప్రధానంగా రాష్ర్టంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని కోరడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వానికి పలు సందర్భాల్లో వినతిపత్రాలు అందజేశామన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావచ్చిన తరుణంలో మరోసారి ఇళ్ల స్థలాల కేటాయింపు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 


అలాగే వర్కింగ్ జర్నలిస్టులకు ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తున్న పెన్షన్ విధానం ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలని ..వర్కింగ్ జర్నలిస్టులకు ఎంతో బాసటగా ఉండే ప్రమాధ భీమాను తిరిగి పునరుద్దరించాలని కూడా కోరడం జరుగుతుందన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ప్రధాన సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అలాగే ఆయా అంశాలపై 14న విజయవాడ రాష్ర్ట కార్యవర్గ సమావేశంలోనూ చర్చించి అవసరమైన మేరకు తీర్మాణాలు చేస్తామన్నారు. ఇంకా ఆయా జిల్లాల్లో నిర్వహించాల్సిన మహాసభలు, రాష్ర్ట సమావేశాలపై కూడా ఆ సమావేశంలో తుదినిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సభ్యత్వనమోదు కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. త్వరలో జాతీయ , రాష్ర్ట కౌన్సిల్ సభ్యులను జిల్లాల వారీగా నామినేట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మధన్, స్మాల్ అండ్ మీడియం విశాఖ అధ్యక్షులు జగన్ మోహన్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు 

ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి.రవికుమార్  పితాని సూర్యప్రసాద్ ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్ ఎన్ రామకృష్ణ, గొడబ రాంబాబు జాయింట్ సెక్రెటరీ పి.రవి శంకర్ ఉపాధ్యక్షులు. కిషోర్ నగేష్.బాబు,, రాజశేఖర్

స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బొబ్బర ప్రసాద్, ట్రెజరర్ కెవి శర్మ, కార్యవర్గ సభ్యులు అరుణ్ భాస్కర్ (హరి),

Comments