Skip to main content

బీబీఏ, ఇంటిగ్రేటెడ్ బీబీఏ–ఎంబీఏ కోర్సుల దరఖాస్తుల గడువు జూలై 15 వరకు పొడిగింపు

 

               K.V.SHARMA EDITOR 
ఆంధ్ర విశ్వవిద్యాలయం, జూలై 6: విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని  బీబీఏ (3 సంవత్సరాలు), ఇంటిగ్రేటెడ్ బీబీఏ–ఎంబీఏ (5 సంవత్సరాలు) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఆంధ్రా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్  డైరెక్టర్ ప్రొఫెసర్ డి.ఎ. నాయుడు సోమవారం ప్రకటన విడుదల చేసారు .

 ఈ కోర్సులు జాతీయ విద్యా విధానం (NEP–2021) ప్రకారం మల్టీ ఎంట్రీ–ఎగ్జిట్ విధానంతో నిర్వ‌హిస్తున్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై 15  వరకు ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. జూలై 21 మరియు 23 తేదీల్లో గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జూలై 25న సీట్ల కేటాయింపు నిర్వ‌హించి, జూలై 27 నుంచి 31వ తేదీ వరకు ఫీజుల చెల్లింపునకు అవకాశం కల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ప్రతి విద్యా సంవత్సరానికి కోర్సు ఫీజును రూ.1,50,000గా నిర్ణయించారు. ప్రవేశాల సమయంలో అభ్యర్థులు రూ.500 కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా కాల్ లెటర్లు పంపబోమని, అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో హాజరుకావాలని అధికారులు సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రా యూనివర్సిటీ అడ్మిషన్స్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

Comments