Skip to main content

ఈ నెల 16న ఇస్కాన్ శ్రీ జగన్నాథ రథయాత్ర

                      K.V.SHARMA EDITOR 


విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తలు :13జూన్,:ఈ నెల 16వ తేదీన వరుసగా 16 వ సారి అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సాగర్ నగర్ ఆధ్వర్యంలో పూరి తరహాలో అత్యంత వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ విశాఖ నగర శాఖ అధ్యక్షుడు సాంబదాస్ ప్రభుజీ తెలిపారు.విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్లో సోమవారం నిర్వహించిన మీడియా  సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ జగన్నాథ సుభద్ర బలభద్ర దివ్యమూర్తులను విశిష్ట అలంకరణ గల మూడు రథాలపై ఉంచి మంగళధ్వని, వేదమంత్రములతో,కోలాటం, హరేకృష్ణ మహా మంత్ర సంకీర్తన, భజనలు,విచిత్ర వేషధారణలతో నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ జగన్నాథ రథయాత్ర సెంట్రల్ పార్క్ వద్ద గల ప్రభుత్వ మహిళా కళాశాల నుండి ప్రారంభమై డాబాగార్డెన్స్ ,జగదాంబ రాంనగర్ మీదుగా సిరిపురం గురజాడ కళాక్షేత్రం వద్ద ముగిస్తుందని తెలిపారు.


ఇస్కాన్ మాతాజీ నితాయ్ సేవిని మాట్లాడుతూ సిరిపురం గురజాడ  కళాక్షేత్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి ని కొలువుదీర్చి  ప్రత్యేక పూజలు , అర్చనలు నిర్వహించి 1008 రకాల ప్రసాదాలను దివ్య మంగళ మూర్తులకు నివేదించి 108 దీపాలతో Newly మంగళ హారతి ఇస్తామని తెలిపారు.వీటితోపాటు ఆధ్యాత్మిక  ప్రవచనాలు,సంకీర్తనలు ఉంటాయని, అనంతరం శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవంలో పాల్గొన్న ప్రతిభక్తునికి అన్న ప్రసాద వితరణ చేస్తామని  తెలిపారు ఆధ్యాత్మికంగా ఇస్కాన్ నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రలో విశాఖవాసులు,భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షాన్ని పొంది ఆధ్యాత్మిక ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.


Comments