నుంచి అయోధ్య–కాశీ ఉచిత దివ్య దర్శన యాత్రకు ఘన శ్రీకారం* *ప్రత్యేక రైలుతో తొలి విడతలో 1,600 మంది భక్తులకు ఉచిత యాత్ర ప్రారంభించిన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్* - *ప్రజలకు ఇచ్చిన అయోధ్య–కాశీ ఉచిత దర్శన హామీని నెరవేర్చాం* - *ప్రయాణం, భోజనం, వసతి, వైద్య సేవలు సహా యాత్ర మొత్తం పూర్తిగా ఉచితం* - *ప్రతి అర్హ భక్తుడికి దశలవారీగా అవకాశం... సెప్టెంబర్‌లో రెండో విడత యాత్ర* - *దేశ చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులు వస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంగా అనకాపల్లి* - *అనకాపల్లిని దేశంలోనే ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం* - *ఆధ్యాత్మిక సేవతో పాటు అభివృద్ధి కూడా మా లక్ష్యం* - *ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తాం*
K.V.SHARMA EDITOR
అనకాపల్లి పార్లమెంట్ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అయోధ్య - కాశీ ఉచిత దివ్య దర్శన యాత్ర హామీని కార్యరూపంలోకి తీసుకొస్తూ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ ఆదివారం అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక రైలుకు జెండా ఊపి చారిత్రాత్మక ఉచిత ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు.డాక్టర్ సి.ఎం. రమేష్ గారు, సతీమణి శ్రీదేవి గారు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి ప్రత్యేక రైలును ప్రారంభించారు. తొలి విడతలో 1,600 మంది భక్తులు అయోధ్య శ్రీరామ జన్మభూమి, వారణాసి శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని దర్శించేందుకు ప్రత్యేక రైలులో బయలుదేరారు.
అనకాపల్లి రైల్వే స్టేషన్ మొత్తం "జై శ్రీరామ్"... "హర హర మహాదేవ్" నినాదాలతో మార్మోగిపోయింది. భారీ సంఖ్యలో భక్తులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని యాత్రికులకు ఘనంగా వీడ్కోలు పలికారు.రైలు బయలుదేరే ముందు ఎంపీ గారు ప్రతి కోచ్‌ను స్వయంగా సందర్శించి యాత్రికులను ఆప్యాయంగా పలకరించారు.వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, సౌకర్యాలను పరిశీలించి, ప్రతి యాత్రికుడు సురక్షితంగా దర్శనం పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.అనంతరం అదే ప్రత్యేక రైలులో యాత్రికులతో కలిసి ఆయన కూడా ప్రయాణం ప్రారంభించి ప్రతి బోగీలోకి వెళ్లి భక్తులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సి.ఎం. రమేష్ మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన అయోధ్య కాశీ ఉచిత దర్శన హామీని నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూడా శ్రీరాముడు, కాశీ విశ్వనాథుడి దర్శనం కల్పించాలనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.ప్రయాణం, భోజనం, వసతి, త్రాగునీరు, వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని, ప్రతి కోచ్‌కు ప్రత్యేక ఇన్‌చార్జిలు, వాలంటీర్లు, వైద్య బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రతి అర్హ భక్తుడికి దశలవారీగా ఈ అవకాశాన్ని కల్పిస్తామని, రెండో విడత ప్రత్యేక రైలును సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల స్పందనను బట్టి భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అనకాపల్లి అభివృద్ధిపై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాకు రూ.5 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక పెట్టుబడులు సాధించామని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి రాని స్థాయిలో పెట్టుబడులు అనకాపల్లికి వస్తున్నాయని తెలిపారు. "అనకాపల్లి అక్షరాల్లోనే కాదు... అభివృద్ధిలో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది" అని అన్నారు.రాబోయే రోజుల్లో అనకాపల్లిని దేశంలోనే ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రైల్వే, రోడ్లు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనపై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక సేవతో పాటు అభివృద్ధి కూడా తమ లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ చారిత్రాత్మక యాత్ర విజయవంతం కావడానికి సహకరించిన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, కె.ఎస్.ఎన్. రాజు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, కూటమి నాయకులు, రైల్వే అధికారులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.దేశం మరింత అభివృద్ధి చెందేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని, అయోధ్య శ్రీరాముడు, కాశీ విశ్వనాథుని ఆశీస్సులు దేశ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. భక్తులందరూ క్షేమంగా దర్శనం పూర్తి చేసుకుని ఆనందంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.





Comments
Post a Comment