ప్రచురణార్థం** **తేదీ: 17-07-2026** **స్థలం: పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా** *గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు* *గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి – GO No. 3కు చట్టబద్ధత కల్పించి, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి** **కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి* – *ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి**
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈరోజు **GO No. 3కు చట్టబద్ధత కల్పించడం, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం** వంటి ప్రధాన డిమాండ్లతో సోషల్ మీడియా క్రియేటర్స్ గిరిజన సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుండి గిరిజనులు. ఏజెన్సీ ప్రాంతంలోని అరకు, పాడేరు, చింతపల్లి, అనంతగిరి, జి.కే.వీధి, హుకుంపేట, పెదబయలు, ముంచింగిపుట్టు తదితర మండలాల నుంచి వేలాదిగా గిరిజనులు, యువత, మహిళలు పాల్గొని ప్రభుత్వానికి తమ గళాన్ని వినిపించారు.
ఈ ర్యాలీలో **ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి** పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా **GO No. 3కు చట్టబద్ధత కల్పించి వెంటనే అమలు చేయాలని**, అలాగే **1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి గిరిజన భూములను పరిరక్షించాలని** కోరారు.
గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు, విద్య, ఉపాధి అవకాశాల్లో స్థానిక గిరిజనులకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గిరిజనుల హక్కులను బలహీనపరిచే ఏ నిర్ణయాన్నైనా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
ర్యాలీలో పాల్గొన్న గిరిజన నాయకులు మాట్లాడుతూ, **GO No. 3 అమలు గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం చేయడమే కాకుండా, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే చర్య** అని పేర్కొన్నారు. అలాగే **1/70 చట్టం గిరిజన భూములను పరాయివారి చేతుల్లోకి వెళ్లకుండా రక్షించే కీలక చట్టం** అని, దానిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.
ప్రభుత్వం వెంటనే గిరిజనుల న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, ఏజెన్సీ వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొని **"GO No. 3 అమలు చేయాలి", "1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి", "గిరిజన హక్కులను కాపాడాలి"** అంటూ నినాదాలతో పాడేరు పట్టణాన్ని హోరెత్తించారు. ఏజెన్సీ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో ర్యాలీ విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు **ఎం. ప్రేమ్ కుమార్, భాను, సిహెచ్. రావు, గంపరాయి సమ్మారెడ్డి, బంగర్ రాజు** తదితరులు, గిరిజన సంఘాల నాయకులు, యువజన ప్రతినిధులు, మహిళలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments
Post a Comment