Skip to main content

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 17.07.2026

.                    K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తలు: ఈరోజు అనగా తేదీ 17.07.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు డ్రైడే-ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా కణితి ప్రాధమిక ఆరోగ్య కేంద్రము పరిదిలో తిరుమల నగర్ సచివాలయం, వడ్లపూడి సందర్శించి 2 లార్వా కంటైనర్లు తనిఖీ చేశారు. ఇళ్ళ లోపల, బయట కూడా నీరు నిలువ లేకుండా చూసుకోవాలని ప్రజలకు తెలియచేసారు. కణితి లో ఓపి చూస్తున్న ఏ.ఎన్.ఎం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైడే-ఫ్రైడే కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, ఏ.ఎన్.ఎం.లు అందరూ పాల్గొన్నారు.  తదుపరి పెదగంట్యాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఓపి సేవలు పరిశీలించి ఓపి సేవలు ఇంకా పెంచాలని అక్కడ ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్ గైర్హాజరు పై అసహనం వ్యక్తం చేశారు. ఇ.హెచ్.ఆర్., అభ ఐడి రిజిస్ట్రేషన్, ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట పబ్లిక్ పెర్సప్షన్, కె.పి.ఐ. ఇండికేటర్స్, ఆర్.బి.ఎస్.కె సేవలు, ఓపి, ఐపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, మందులు లభ్యత,  ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. పట్టణ ఆరోగ్య కేంద్ర పరిసర ప్రాంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. 

ఈ సందర్శనలో ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా.స్వరూప, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ బి. నాగభూషణ రావు, కణితి ఎం.పి.హెచ్.ఇ.ఒ మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.  

           జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

                       విశాఖపట్నం


         

Comments