ఈ రోజు అనగా తేది. 18.07.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి ఆదేశానుసారం ప్రతీనెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
తదుపరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గల జిల్లా ప్రోగ్రాం అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది అందరూ పరిసరాల పరిశుభ్రత చేసారు ముఖ్యంగా ఈరోజు తమ తమ టేబుల్స్, కంప్యూటర్స్, రికార్డ్స్, విండో డోర్స్, పనికిరాని వస్తువులను అన్ని మరియు కార్యాలయం లోపల, వెలుపల శుభ్రం చేశారు. .
శ్రమదానం ద్వారా చెత్త దిబ్బలను శుభ్రపరిచి తిరిగి ఆ ప్రదేశంలో చెత్త వేయకుండా ఉండుటకు మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. తడి చెత్తకు గ్రీన్ డస్ట్ బిన్, పొడి చెత్తకు రెడ్ డస్ట్ బిన్ హానికరమైన చెత్తకు బ్లూ డస్ట్ బిన్ ఉపయోగించవలెను. ఇల్లు, దుకాణములు, స్కూల్స్, సంస్థలు మొదలగు ప్రదేశాలలో ఏర్పడే చెత్తను 3 రకాలుగా వేరుచేసేలా అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రోగ్రాం అధికారులు, శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో, శ్రీ భవాని ప్రసాద్, ఆఫీస్ సూపరింటెండెంట్, శ్రేమతి సయ్యద్ బేగం, డిప్యూటీ.హెచ్,ఇ.ఒ., శ్రీ గెడ్డం శ్రీనివాస రావు, ఎం.పి.హెచ్.ఇ.ఒ, వైద్య ఆరోగ్య సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొని తమ తమ సెక్షన్లను శుభ్రం చేసుకోనడమే కాకుండా పరిసరాలను పరిశుభ్రం చేసుకున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment