జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం ໖: 20-07-2026 సింహాచలం గిరిప్రదక్షిణ (జూలై 28, 29) నేపథ్యంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు మరియు మెడికల్ కాలేజీలకు అత్యవసర వైద్య సేవల సన్నద్దత ఉత్తర్వులు.
ముఖ్యమైన ఆదేశాలు:
అత్యవసర మందులు & రక్తం నిల్వ ఉంచుకోవడం: అన్ని ఆసుపత్రులు ప్రాణ రక్షణ మందులు, అత్యవసర ఐవి (IV) ద్రవాలు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు మరియు తగినంత రక్తాన్ని (Blood Reserves) ముందస్తుగా సిద్ధం చేసుకోవాలి, ఐసియు (ICU) మరియు ఎమర్జెన్సీ వార్డులలోని వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు వంటి పరికరాలు 100% పనితీరుతో సిద్ధంగా ఉండాలి.
ముందస్తు (Elective) శస్త్రచికిత్సలు మరియు ఓపిడి (OPD) నిలిపివేత: అత్యవసర కేసులు మినహా, మిగిలిన సాధారణ మరియు ముందస్తుగా ప్లాన్ చేసిన శస్త్రచికిత్సలను ఈ రెండు రోజులు నిలిపివేయాలి. సాధారణ ఓపిడి (రొటీన్ అవుట్ పేషెంట్) సేవలను తగ్గించి, అత్యవసర వైద్య విభాగానికి (Emergency/Trauma) ప్రాధాన్యత ఇవ్వాలి.
డయాలసిస్ మరియు కీమోథెరపీ రోగుల రీషెడ్యూలింగ్: డయాలసిస్, కీమోథెరపీ మరియు ఇతర దీర్ఘకాలిక చికిత్సలు తీసుకునే రోగులకు ముందస్తు సమాచారం అందించి, వారి చికిత్సలను గిరిప్రదక్షిణ తేదీలకు ముందే (Prepone) లేదా తర్వాత (Postpone) జరిగేలా పునఃసమీక్షించాలి. దీనివల్ల రద్దీ సమయంలో వారు ప్రయాణ ఇబ్బందులు పడకుండా ఉంటారు.
హెల్త్ సిటీ పరిసరాల్లో వాహనాల నియంత్రణ: ఆరిలోవ/చినగదిలి "హెల్త్ సిటీ" (Health City) పరిసర ప్రాంతాలలో అత్యవసర వైద్య వాహనాలు (అంబులెన్సులు) మినహా, ఇతర ఆసుపత్రి సిబ్బంది మరియు పరిపాలనా విభాగానికి చెందిన అనవసర వాహనాల రాకపోకలను పూర్తిగా తగ్గించాలి. అత్యవసర రోగుల వాహనాలకు దారి క్లియర్ గా ఉంచాలి.
గమనిక: ప్రజా ఆరోగ్యం, భక్తుల భద్రత దృష్ట్యా జారీ చేసిన ఈ అత్యవసర ఆదేశాలను పాటించని ఆసుపత్రులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. అన్ని ఆసుపత్రులు తమ సన్నద్ధత నివేదికను జూలై 25 లోగా డి.ఎం. హెచ్.ఓ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment