Skip to main content

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. ​భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో మార్పులు గుడి ప్రదక్షిణ రూట్‌ను పరిశీలించిన ఆలయ ఈవో ఇంజినీరింగ్ అధికారులు. ​సింహాచలం:20 జూలై 2026. ఈ నెల 28 మరియు 29వ తేదీలో గిరి ప్రదక్షణ ఏర్పాట్లపై ఆలయ కార్య నిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం క్యూలైన్ల వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, ఈసారి భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో తిరిగి అలసిపోకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ​ముఖ్యంగా కొండ చుట్టూ తిరిగి వచ్చే భక్తులకు క్యూలైన్ల మధ్య దూరం ఎక్కువగా ఉండటం వల్ల గతంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని గమనించిన అధికారులు ఈ ఏడాది క్యూలైన్లను మరింత దగ్గరగా, తక్కువ దూరంతో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తులు నడిచే దూరం తగ్గడంతో పాటు స్వామి వారి దర్శనం మరింత వేగంగా, సులువుగా అవుతుందని అధికారులు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు గుడి ప్రదక్షిణ రూట్ మొత్తాన్ని క్షేత్రస్థాయిలో ఇఓ ఇంజినీరింగ్ అధికారులు తో కలిసి స్వయంగా పరిశీలించారు. కాలి నడకన వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండడానికి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ​అదేవిధంగా, 29 వ తేదీ న గుడి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు సులభంగా దారి తెలిసేలా అవసరమైన అన్ని ముఖ్య కూడళ్లలో సైన్ బోర్డులను (దిశా నిర్దేశక బోర్డులు) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనులను వేగవంతం చేస్తున్నారు.

.                  K.V.SHARMA EDITOR 
సింహాచలం:20 జూలై 2026.ఈ నెల 28 మరియు 29వ తేదీలో గిరి ప్రదక్షణ ఏర్పాట్లపై ఆలయ కార్య నిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు  స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం క్యూలైన్ల వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. 

గత ఏడాది అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, ఈసారి భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో తిరిగి అలసిపోకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.


ముఖ్యంగా కొండ చుట్టూ తిరిగి వచ్చే భక్తులకు క్యూలైన్ల మధ్య దూరం  ఎక్కువగా ఉండటం వల్ల గతంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని గమనించిన అధికారులు ఈ ఏడాది క్యూలైన్లను మరింత దగ్గరగా, తక్కువ దూరంతో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తులు నడిచే దూరం తగ్గడంతో పాటు స్వామి వారి దర్శనం మరింత వేగంగా, సులువుగా అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు గుడి ప్రదక్షిణ రూట్ మొత్తాన్ని క్షేత్రస్థాయిలో ఇఓ ఇంజినీరింగ్ అధికారులు తో కలిసి స్వయంగా పరిశీలించారు. కాలి నడకన వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండడానికి సిబ్బందికి పలు సూచనలు  జారీ చేశారు.


అదేవిధంగా, 29 వ తేదీ న గుడి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు సులభంగా దారి తెలిసేలా అవసరమైన అన్ని ముఖ్య కూడళ్లలో సైన్ బోర్డులను (దిశా నిర్దేశక బోర్డులు) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనులను వేగవంతం చేస్తున్నారు.

Comments