Skip to main content

ఘనంగా శ్రీవేంకటేశ్వర కళాశాల వార్షికోత్సవం.. ‌‌ ఆనందోత్సవాల ‌మధ్య 2022-25 మీట్ అప్.....

.                SRINIVAS SPL Correspondant 
 అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం  శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల 22వ వార్షికోత్సవం మరియు 2022-25  పూర్వ విద్యార్థుల  మీట్ అప్ కార్యక్రమాలు   కళాశాల యజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర కళాశాలలో ఆనందోత్సవాల మధ్య  ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు  సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిని హోరేత్తించారు.  


కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కె.వి.ఆర్.ఎన్ నరసింహారావును విద్యార్థులు పూలమాలలు వేసి  దుస్సాలువాలు కప్పి ప్రత్యేక బహుమతి అందజేసి   ఘనంగా సత్కరించారు. కే మనోహర్, కరాటం ప్రవీణ్, వై వరప్రసాద్, ‌ కే శ్రావణ్ దిలీప్ , భవాని , వైష్ణవి, అరుణ్, మహాలక్ష్మి,‌ వెంకటేష్, దివ్య, పాల్ తదితరులను కూడా ఘనంగా సత్కరించారు.2022-2025 బ్యాచ్ విద్యార్థులు గేట్ టుగేదర్ పార్టీ  మీట్ అప్ లో కలిసి అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. 


ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కె వి ఆర్ ఎన్ నరసింహారావు మాట్లాడుతూ 2022-25 పూర్వ విద్యార్థినీ విద్యార్థులు 22వ వార్షికోత్సవం ఏర్పాటు చేసుకుకోవడం చాలా సంతోషంగా ఉందని, డిగ్రీ చదివిన రోజులు గుర్తుకు చేసుకోవడం అనేది జీవితంలో మర్చిపోలేనదని ఆయన అన్నారు. అదేవిధంగా 2005 జూలై 5న అత్యుత్తమమైన సీనియర్ అధ్యాపకుల చే డిగ్రీ కళాశాల ఏర్పాటు జరిగిందని, అదేవిధంగా తద్వారా కంప్యూటర్ సైన్స్ వాళ్లకి ఆ సెక్టర్ లోని కామర్స్ వారికి బ్యాంకింగ్ సెక్టార్స్ లోని అలాగే మిగిలినటువంటి బయోలాజికల్ సైన్స్ కి ఫార్మా కంపెనీ కోడింగ్ కంపెనీ జాబ్ అవకాశాలను కల్పిస్తున్నామని, అలాగే వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి


 ఇతర డిగ్రీ కాలేజీల్లో విద్యనభ్యసించిన విద్యార్థులకు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఆ యా కంపెనీ లో ఉధ్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, కోనసీమలో ఉన్నటువంటి చదువుకున్న ఏ ఒక్క విద్యార్థి ఖాళీగా ఉండకూడదనే మంచి ఆలోచనతో ఎన్నో చోట్ల ఉధ్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని,ఈ కళాశాల నుండి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Comments