Skip to main content

రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ శ్రీ మహమ్మద్ ఇమ్రాన్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలనే ఉద్దేశంతో డీఎస్సీ–2026 పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


అలాగే జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష అక్రమాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తూ, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, పేద విద్యార్థుల ఉన్నత విద్య వంటి అంశాలు రాజకీయాలకు అతీతమైనవని, ఇవి లక్షలాది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామకాల్లో అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ–2026 పరీక్షల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెలువడినా ప్రభుత్వం వాటిపై స్పష్టత ఇవ్వకుండా మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ఒకే వ్యవస్థ పరిధిలో ఉంచడం, ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను భాగస్వామ్యం చేయడం, పరీక్షల నిర్వహణలో పనిచేసిన వ్యక్తికే అత్యున్నత ర్యాంకు వచ్చిందనే ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి వివరాలు మెరిట్ జాబితా నుంచి తొలగించబడటం, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలవకపోవడం, మెరిట్ జాబితాల్లో మార్పులు జరిగాయనే ఆరోపణలు, సర్టిఫికెట్లు ధృవీకరించబడినా కొందరికి నియామకాలు ఇవ్వకపోవడం, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలు, జీవో నంబర్లు 4, 47, 56 ద్వారా నిబంధనల్లో జరిగిన మార్పులు వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. టీచర్ పోస్టుల కోసం అక్రమ బేరసారాలు జరిగాయనే వీడియోలు వెలుగులోకి వచ్చినప్పటికీ అసలు సూత్రధారులపై చర్యలు తీసుకోకుండా నామమాత్రపు కేసులతో సరిపెట్టడం వెనుక కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి తప్పులు జరగలేదని చెబుతున్నట్లయితే వెంటనే సీబీఐ విచారణకు అంగీకరించాలని, లేకపోతే కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని కోరారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా కొట్టిపారేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వైద్య విద్యలో ప్రవేశం కోసం విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమవుతారని, ఒక్క ప్రశ్నపత్రం లీకేజీ వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి పరీక్షా కేంద్రాల వరకు ప్రతి దశలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అన్ని బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిగే వరకు, విద్యార్థుల హక్కులు పరిరక్షించబడే వరకు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల పోరాటం నిరంతరం కొనసాగుతుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.


ఈ సమావేశం లో  జిల్లా యువజన విభాగం అధ్యక్షులువురుకుతి రామ చంద్ర రావు (చందు) , రాష్ట్ర విద్యార్ధి విభాగం కార్యనిర్వాహక అద్యక్షులు ద్రోణం రాజు శ్రీవాత్సవ ,  జోనల్ యువజన్  విభాగమ అద్యక్షులు అంబటి శైలష్ ,  జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఖండవలి రోహిత్ , నియోజకవర్గం అద్యక్షులు రవి కిరణ్ రెడ్డి , రౌత్ శ్రీను తదితరాలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...