విశాఖపట్నం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు.ముఖ్య అతిథిగా రాష్ట్ర సూక్ష్మ, చిన్న,మధ్యతరహ పరిశ్రమలు,గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో సమావేశం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొండపల్లి మాట్లాడుతూ ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ వంటి వేదికలలో పాల్గొనడం వల్ల దృక్పథం విస్తృతమవుతుందని, నైపుణ్యాలు మరియు నిరంతర అభ్యాసంపైనే భవిష్యత్తు విజయం ఆధారపడి ఉంటుందన్నారు.ఏఐ రంగాన్ని కేవలం ఆలోచనల స్థాయి నుంచే కాకుండా ఆచరణాత్మకంగా వేగవంతం చేసేందుకు పాలసీదారులు, గ్లోబల్ టెక్ నాయకులు, పరిశ్రమల నిపుణులు ఈ వేదికపైకి రావడం హర్షణీయమని కొనియాడారు. ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ లాంటి వేదికలు యువత ఆలోచనా పరిధిని పెంచుతాయని, వాట్సాప్ ద్వారా ప్రభుత్వ విధానాలను తెలుసుకోవడం, ప్రభుత్వ సేవలు పొందడం లాంటి ఏఐ అధారిత సేవలను ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థాపకులుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యుత్ శాఖల మంత్రి నారా లోకేష్ నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని, పలు సవాళ్లను అధిగమిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు వీరు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు.ఆంధ్రప్రదేశ్ కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా, అనేక రకాల అధునాతన సాంకేతిక రంగాలలో పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.ఏపీడీటీఐ నెట్‌వర్క్
ఛైర్మన్ కొసరాజు శ్రీథర్ మాట్లాడుతూ గత రెండేళ్లలో దేశంలో జరిగిన ఏఐ మరియు డేటా సెంటర్ పెట్టుబడులలో దాదాపు 20% ఆంధ్రప్రదేశ్‌కే రావడం ద్వారా రాష్ట్రం వేగంగా ఏఐ మౌలిక సదుపాయాల కేంద్రంగా ఎదుగుతోందన్నారు. గూగుల్, రిలయన్స్, ఆర్ఎంజి, రీన్యూ క్టర్ల్స్ వంటి అంతర్జాతీయ,భారతీయ సంస్థలు దాదాపు 4 జిడబ్ల్యు డేటా సెంటర్ సామర్థ్యాన్ని ప్రకటించడం ద్వారా విశాఖపట్నాన్ని ఒక ప్రధాన ఏఐ పెట్టుబడి గమ్యస్థానంగా నిలబెట్టాయన్నారు. ఏఐ నైతికత, బాధ్యత మరియు మానవ కేంద్రీకృత విధానాలతో ఉండేలా చూసుకుంటూనే, ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన ఏఐ-నేటివ్ (ఏఐ ఆధారిత) ఉత్పత్తులను రూపొందించాలని స్టార్టప్‌లు,సంస్థలను ఆయన కోరారు
.గౌరవ అతిథిగా హాజరైన ఎస్టీపిఐ అదనపు డైరెక్టర్ డాక్టర్ సురేష్ బాతా మాట్లాడుతూ ఇంక్యుబేషన్ మద్దతు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, పరిశ్రమల సహకారం, ఓపెన్ ఇన్నోవేషన్ కార్యక్రమాల ద్వారా ఆవిష్కరణ,వ్యవస్థాపకతను పెంపొందించడానికి తమ సంస్థకు ఉన్న అచంచలమైన నిబద్ధతను వివరించారు. విద్యార్థులు కేవలం పారిశ్రామికవేత్తలుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ,ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో
టాలెంట్ ఏపీ ప్రెసిడెంట్ నర్రా సురేష్,ఐటీఏఏపీ ప్రెసిడెంట్ దాసరి కిషోర్ , పలు కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఎకోసిస్టమ్ భాగస్వాములుగా ఎస్టీపీఐ,ఐఐఎం, విశాఖపట్నం అసోసియేషన్ భాగస్వామిగా ఐటీఏఏపీ, ప్రభుత్వ భాగస్వాములుగా ఎస్టీపీఐ,ఎన్ఆర్డీసి,భారత ప్రభుత్వం ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ భాగస్వాములుగా టీఐఈ వైజాగ్ , ఆర్టీఐహెచ్,ఇండియా ఏఐ సిఓఈ, ఏ హబ్ , ఐ హబ్ -డేటా, ఐఐఐటీ హైదరాబాద్ వ్యవహరించాయి.






Comments
Post a Comment