Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం 21 రోజుల్లో రూ.1.76 కోట్ల హుండీ ఆదాయం భక్తుల కానుకలతో పాటు బంగారం, వెండి సమర్పణ ఈఓ జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీ లెక్కింపు

 


సింహాచలం, జూలై 8: శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు కార్యక్రమం అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు.

జిల్లా ఎండోమెంట్స్ శాఖ అధికారులైన సురేష్, ప్రసాద్, టెంపుల్ సెక్యూరిటీ ఎస్‌పీఎఫ్ పోలీసు బలగాల పర్యవేక్షణతో పాటు ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీల లెక్కింపు చేపట్టారు.


గత హుండీ లెక్కింపు జూన్ 17, 2026న నిర్వహించగా, ప్రస్తుత హుండీ లెక్కింపు జూలై 8, 2026న జరిగింది. మొత్తం 21 రోజుల కాలానికి గాను భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను లెక్కించారు.

ఈ హుండీ లెక్కింపులో **భక్తులు రూ.1,76,08,144/-**లను కానుకగా సమర్పించారు.

 ఇందులో భారతీయ కరెన్సీ నోట్లు రూ.1,65,76,343/-, నాణేలు రూ.10,31,801/- ఉన్నాయి. రోజువారీ సగటు హుండీ ఆదాయం **రూ.8,38,483/-**గా నమోదైంది.

అదేవిధంగా హుండీలలో 102 గ్రాముల 600 మిల్లీగ్రాముల బంగారం, 6 కిలోల 250 గ్రాముల వెండి లభించాయి. అలాగే అమెరికా, యూఏఈ, ఇండోనేషియా, ఇంగ్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్, ఖతార్, మలేషియా, శ్రీలంక, డెన్మార్క్, నేపాల్, కువైట్, కొలంబియా తదితర దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా భక్తులు సమర్పించారు.


హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు కరక దేముడు, నీటుపల్లి మహేష్, మధుపాడ సన్యాసిరావు, కనకాల మురళీమోహన్ శ్రీమతి గుత్తికొండ శ్రీలత, పెద్దిశెట్టి ఉషశ్రీ, చలుమూరి భారతి,  పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా స్వామి నాయుడు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు వాడ్రేవు రమణమూర్తి, పంతం శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, దేవస్థానం సిబ్బంది, శ్రీహరి సేవా వాలంటీర్లు పాల్గొని హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు

Comments