జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 21.07.2026
ఈరోజు అనగా తేదీ 21.07.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు బుచ్సిరాజుపాలెం మరియు లక్ష్మి నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చెయ్యడం జరిగింది.
బుచ్సిరాజుపాలెం పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వారు విధుల గైర్హాజరు అవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైద్యాధికారి కి వేతనం లో ఒక రోజు కోత విధించమని వెంటనే సంబందిత ప్రోగ్రాం అధికారి డిపిఎంఒ వారిని ఆదేశించారు.
తదుపరి అక్కడ ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బందిని సమీక్షించారు. ఇ.హెచ్.ఆర్., అభ ఐడి రిజిస్ట్రేషన్, ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట పబ్లిక్ పెర్సప్షన్, కె.పి.ఐ. ఇండికేటర్స్, ఆర్.బి.ఎస్.కె సేవలు, ఓపి, ఐపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, మందులు లభ్యత, ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు.
రోజు వారీ ముఖ ఆధారిత హాజరు ఇక పై ప్రతి రోజు జిల్లా కార్యాలయం నుండి పర్యవేక్షణ జరుగుతుంది అని సమయ పాలన పాటించని వారి పట్ల తీవ్ర మైన చర్యలు తీసుబోడతాయని హెచ్చరించడం జరిగింది.
పట్టణ ఆరోగ్య కేంద్ర పరిసర ప్రాంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కీటక జనిత
వ్యాధుల వ్యాప్తి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని డ్రై డే ఫ్రైడే కార్యక్రమం ప్రభావితం గా అమలుచేయాలని ఆదేశించారు. ఇక పై డ్రై డే కార్యక్రమాల్ని క్షేత్ర స్థాయిలో జిల్లా వైద్యాధికారి, ప్రోగ్రాం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని కార్యక్రమంలో లోపాలు గమనించిన యెడల సంబంధించిన సిబ్బంది పై చర్యలు తీస్కొబడునని హెచ్చరించడం జరిగింది.
ఈ సందర్శన లో ఈ అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ బి. నాగభూషణ రావు, మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment