జీవీఎంసీలో 25 మంది ఉద్యోగులకు పదోన్నతి. * పదోన్నతి ఉత్తర్వులను అందజేసిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
K.V. SHARMA EDITOR
విశాఖపట్నం, జూలై 22: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ లో 6 గురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా, 19 మందికి జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతిని కల్పిస్తూ ఉత్తర్వులను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తన చాంబర్లో బుధవారం అందించి వారికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పదోన్నతులను రోస్టర్ ప్రకారం అర్హత కలిగిన ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా , వివిధ కేడర్లలో ఉన్న 19 మందికి జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతిని కల్పిస్తూ ఉత్తర్వులను అందించామన్నారు. జీవీఎంసీలో ఎంతో బాధ్యతగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించేందుకు తగు శిక్షణ నైపుణ్యతను పెంపొందించుకోవాలని పదోన్నతి పొందిన ఉద్యోగులకు సూచించారు. మీలో ఎంతమందికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉందని వారిని అడిగి తెలుసుకుని ప్రతి ఒక్కరూ కంప్యూటర్ నైపుణ్యతను అలవర్చుకోవాలని, ప్రభుత్వ విధుల్లో రూల్ పొజిషన్లు తెలుసుకోవాలని, ఉన్నత పదోన్నతులను పొందాలని వారికి సూచించారు.
జీవీఎంసీలో ఏ విభాగంలో మీకు స్థానం కల్పించినా అక్కడ తప్పని సరిగా విధులు నిర్వహించేలా డ్రాప్టింగ్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. తప్పనిసరిగా మీ విధులలో చిత్తశుద్ధిని కనపరుస్తూ బాధ్యతగా విధులు నిర్వహిస్తూ జీవీఎంసీ కి మంచి పేరును తీసుకురావాలని వారికి కమిషనర్ సూచించారు. విధులలో అశ్రద్ధ కనపరిచినా, అవినీతికి పాల్పడిన వెంటనే విధుల నుండి తొలగిస్తామని కమిషనర్ వారికి తెలిపారు.
ఇప్పుడు పదోన్నతులు పొందిన వారికి అన్ని విభాగాల్లో వారు విధులు నిర్వహించేలా కొన్ని రోజులు పాటు అవసరమగు శిక్షణను ఇప్పించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం.సత్యవేణికి కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పి పద్మజ, పర్యవేక్షకులు రియాజ్ తదితరులు పాల్గొన్నారు
పౌర సంబంధాల అధికారి,జివిఎంసి

Comments
Post a Comment