Skip to main content

పుట్టపర్తిలో ఐక్యతకు మహోత్సవం -జూలై 26న భగవాన్ సన్నిధిలో శ్రీ సత్యసాయి 5కే రన్ & రైడ్–2026 గ్రాండ్ ఫినాలే- 1.10 లక్షల మందిని ఉత్తేజపరిచిన గ్రాండ్ ఫినాలే నికి శ్రీ ఆర్.జె. రత్నాకర్, శ్రీ నిమిష్ పాండ్యా జెండా ఊపనున్నారు*

 

                    K.V.SHARMA EDITOR 
పుట్టపర్తి, జూలై 22: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భారతదేశం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "శ్రీ సత్యసాయి 5కే రన్ & రైడ్–2026 – ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ" జాతీయ ఉద్యమానికి ముగింపు ఘట్టంగా గ్రాండ్ ఫినాలే కార్యక్రమం జూలై 26, ఆదివారం ఉదయం 5.30 గంటలకు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించబడనుంది.

*శ్రీ సత్యసాయి 5కే రన్ & రైడ్ – "ఏ స్పిరిట్ ఆఫ్ యూనిటీ" గ్రాండ్ ఫినాలేకు అధికారిక టీ-షర్ట్, బిబ్, ఫినిషర్ మెడల్ ఆవిష్కరణ*

*ఈ రోజు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారు, జూలై 26, 2026న పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న "శ్రీ సత్యసాయి 5కే రన్ & రైడ్ – ఏ స్పిరిట్ ఆఫ్ యూనిటీ" గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన అధికారిక ఈవెంట్ టీ-షర్ట్, బిబ్ (Bib), ఫినిషర్ మెడల్ను ఆవిష్కరించారు*.

*ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్. కోటేశ్వరరావు గారు, జాతీయ సేవా సమన్వయకర్త, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్, శ్రీ సి. గౌతమ్ గారు, రాష్ట్ర యువజన సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్, శ్రీ ఎస్. రామచంద్రరావు గారు, జిల్లా అధ్యక్షులు, శ్రీకాకుళం, శ్రీ సురేష్ గారు, జిల్లా యువజన సమన్వయకర్త, శ్రీ సత్యసాయి జిల్లా తదితరులు పాల్గొన్నారు*.


భగవాన్ శ్రీ సత్యసాయిబాబా బోధించిన "Love all- Serve all, Help ever- hurt never”" అనే దివ్య సందేశాలను ఆచరణలో ప్రతిబింబిస్తూ, ఐక్యత, ఆరోగ్యం, మానవతా విలువలు, ఫిట్ ఇండియా ఉద్యమంకు ప్రేరణగా ఈ జాతీయ కార్యక్రమం రూపుదిద్దుకుంది.

దేశవ్యాప్తంగా 45 ప్రధాన నగరాల్లో విజయవంతంగా నిర్వహించిన ఈ ఉద్యమంలో 1.10 లక్షలకు పైగా యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని దేశ ఐక్యతకు తమ మద్దతు ప్రకటించారు.

ఈ జాతీయ ఉద్యమానికి ముగింపు ఘట్టమైన పుట్టపర్తి కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భారతదేశం అఖిల భారత అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా గారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్నాయి.

ఈ కార్యక్రమానికి శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారు, శ్రీ నిమిష్ పాండ్యా గారు జెండా ఊపి ప్రారంభించనుండగా, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీలు, సేవా సంస్థల జాతీయ, రాష్ట్ర స్థాయి పదాధికారులు, విశిష్ట అతిథులు, దేశం నలుమూలల నుండి విచ్చేసే వేలాది మంది పాల్గొంటారు.

15 సంవత్సరాలు నిండిన యువత, విద్యార్థులు, మహిళలు, సైక్లింగ్ మరియు రన్నింగ్ అభిరుచి కలిగిన వారు, భక్తులు, ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమం ద్వారా పుట్టపర్తి ఐక్యత, సేవ, ఆరోగ్యం, మానవతా విలువలు మరియు భక్తి భావనల మహోత్సవంగా మారనుంది.

*రూట్*

శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియం → పుట్టపర్తి ప్రధాన రహదారి → గణేష్ సర్కిల్ → విమానాశ్రయం సమీపంలోని ప్రశాంతి పెట్రోల్ బంక్ → తిరిగి హిల్ వ్యూ స్టేడియం

*నమోదు చేసుకున్న వారికి ముఖ్య సమాచారం*

జూలై 24, 25 తేదీల్లో ఉదయం 10.00 నుండి సాయంత్రం 7.00 గంటల వరకు ఇండోర్ స్టేడియంలో ఉచిత టీ-షర్టు, బిబ్ నంబర్ పంపిణీ.

జూలై 26 ఉదయం 5.15 గంటలకల్లా హిల్ వ్యూ స్టేడియానికి చేరుకోవాలి.

5కే సైకిల్ రైడ్‌లో పాల్గొనేవారు తమ స్వంత సైకిళ్లను తీసుకురావాలి.

ప్రతి ఫినిషర్‌కు ఫినిషర్ మెడల్, ఈ-సర్టిఫికేట్, అల్పాహారం అందజేయబడుతుంది.

*సహాయ కేంద్రం*

శ్రీ అనిల్: 8897369392

శ్రీ రాజేంద్ర: 7411455705

వైద్య అత్యవసర సేవలు: శ్రీ సాయి కృష్ణ – 8978580720

*మీడియాకు ఆహ్వానం*

ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్రతినిధులందరినీ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాయి.

మీడియా మిత్రులు స్వయంగా 5కే రన్ లేదా 5కే సైకిల్ రైడ్‌లో పాల్గొని, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రేమ, సేవ, ఐక్యత, మానవతా విలువలు, జాతీయ సమైక్యత సందేశాన్ని సమాజానికి మరింత విస్తృతంగా చేర్చాలని సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

*ఫోటో క్యాప్షన్*:

జూలై 26, 2026న పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న "శ్రీ సత్యసాయి 5కే రన్ & రైడ్ – ఏ స్పిరిట్ ఆఫ్ యూనిటీ" గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన అధికారిక టీ-షర్ట్, బిబ్, ఫినిషర్ మెడల్ను 22.07.2026 ఆవిష్కరిస్తున్న శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారు.

ఆయనకు ఇరువైపులా శ్రీ ఎస్. కోటేశ్వరరావు గారు, జాతీయ సేవా సమన్వయకర్త, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ కనిపిస్తున్నారు. చిత్రంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఇతర పదాధికారులు కూడా ఉన్నారు.



Comments