Skip to main content

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 27.07.2026


ఈరోజు అనగా తేదీ 27.07.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి ఆదేశానుసారం డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి సమావేశ మందిరంలో ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యం వారితో గిరి ప్రదిక్షణ నిమిత్తం మెడికల్ క్యాంపులు, అంబులన్స్లు, ఏర్పాట్లు గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 32 మెడికల్ క్యాంపులు, 26 అంబులన్స్ లు (22 ప్రైవేటు హాస్పటల్ అంబులన్స్ లు, 4 ప్రభుత్వం వారి 108 అంబులన్స్ లు) ను 18 మాపింగ్ చేసిన పాయింట్స్ లో పెట్టడం జరిగిందని తెలియచేసారు. 


ముఖ్య ప్రదేశాలైనటువంటి తోలి పావంచ, హనుమంతవాక, లుంబిని పార్క్, పాత గోశాల, ఆర్.హెచ్.సి.సింహాచలం, దేవస్థానం కొండ ఎగువ వంటి ప్రాంతాలలో 14 ప్రత్యెక అంబులన్స్ లు పెట్టడం జరిగింది. 32 మెడికల్ క్యాంపులు 28 వ తేది. ఉదయం 07:00 గంటల నుండి 29 వ తేది. రాత్రి 08:00 గంటల వరకు జరుగును అని తెలియచేసారు. ప్రైవేటు హాస్పిటల్స్ వారందరూ వారికీ  కేటాయించిన మెడికల్ క్యాంపుల నందు కేటాయించిన సమయానికి ఒక గంట ముందుగానే సంబందిత వైద్యాధికారి వారికీ రిపోర్టింగ్ చేయాలనీ తెలియచేసారు.

ఈ సమావేశంలో డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ వారు, శ్రీ బి. నాగేశ్వర రావు డెమో వారు, డా.కె.అప్పారావు, ఎన్టీఆర్ వైద్య సేవ కో-ఆర్డినేటర్ వారు, ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యం పాల్గొన్నారు       

           జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

            విశాఖపట్నం



         

  

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...