Skip to main content

జూలై 28 న రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలపై భారీ నిరసన ర్యాలీ* *విశాఖపట్నంలో మహాత్మా గాంధీ విగ్రహం నుంచి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ* *: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకె రాజు డిమాండ్*


విశాఖపట్నం, జూలై 25 (శనివారం):ఈరోజు ఉదయం విశాఖపట్నం మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డులోని వై యస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు గారు ముఖ్య అతిథిగా హాజరై, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్న విద్యా మరియు ఉపాధి పరిస్థితులపై పార్టీ నాయకులతో చర్చించారు. సమావేశం అనంతరం రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో లోపాలు, అలాగే నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం వంటి అంశాలకు నిరసనగా ఈ నెల జూలై 28న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కెకె రాజు గారు ఆవిష్కరించారు.


ఈ సందర్బంగా *కెకె రాజు*   మాట్లాడుతూ...దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాల వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో నిర్లక్ష్యానికి నిరసనగా జూలై 28 (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకె  రాజు తెలిపారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3,000 నిరుద్యోగ భృతి అందిస్తామని, అలాగే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. అదేవిధంగా మెగా డీఎస్సీ నియామకాలలో నిబంధనలను మార్చి లక్షలాది మంది అభ్యర్థులను అయోమయానికి గురి చేశారని, డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన వంటి విద్యార్థుల సంక్షేమ పథకాల అమలులో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఘటన కారణంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం దెబ్బతిందని అన్నారు.  ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో, వివిధ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ యువత, ప్రజాసంఘాలతో కలిసి భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఈ నిరసన ర్యాలీ జూలై 28 ఉదయం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమై, డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగ యువతీ యువకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని, యువతకు జరిగిన అన్యాయంపై గళం వినిపించాలని కెకె  పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో సమన్వయ కర్తలు మొల్లి అప్పారావు , పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవి రెడ్డి , జిల్లా యువజన విభాగం అధ్యక్షులు వరుకూటి రామ చంద్రరావు (చందు) మరియు జోనల్ విభాగానం అధ్యక్షులు అంబటి నాగ వినాయక శైలేష్ , రాష్ట్ర యువజన, విద్యార్థి నాయకులు బాణాల తరుణ్ కుమార్, దొడ్డి కిరణ్, సూరాడ అనుదీప్, జీరు రాపు రాపు రెడ్డి, గుంటు ఆనంద్, జగ శ్రవణ్ కుమార్, పాల రమణ, కాగితాల రవికిరణ్, తాడి రవితేజ, మువ్వల సంతోష్ కుమార్ రెడ్డి, వాక తులసి కృష్ణ కుమార్; రాష్ట్ర యువజన, విద్యార్థి నాయకులు మీసాల వి.డి.ఎస్. ప్రదీప్, యలమంచిలి సంతోష్ కుమార్, సంతోష్ కుమార్, వెంకట సతీష్ కుమార్, మద్ది కామేష్ రెడ్డి, ఖండవలి రోహిత్, గుజ్జరి మురళి, సోడి విమల కుమార్, బి.సి. రెడ్డి, అబ్దుల్ కరీం ఖాన్, పల్లా రామకృష్ణ చైతన్య, మరియు మహ్మద్ సర్ఫరాజ్ ఆలం తదితరాలు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...