శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, సింహాచలం. సింహాచలం, 29 జూలై 2026: ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో శతాబ్దాల నాటి సాంప్రదాయ చారిత్రక ఘట్టం 'ఢిల్లీవిజయోత్సవం' నేడు అత్యంత వైభవంగా జరిగింది.
వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ధిల్లీ విజయోత్సవం ఉత్సవాన్ని నేడు భక్తిశ్రద్ధలతో, ఆగమశాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ వెంకట్రావు ఆధ్వర్యంలో, స్థానాచార్యులు డాక్టర్ డి.పి. రాజగోపాల్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ విశిష్ట ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
స్థానాచార్యులు డా. డి.పి. రాజగోపాలాచార్యులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో ముస్లిం దండయాత్రల కాలంలో భక్తుల రక్షణార్థం శ్రీ స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ గర్భగుడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించి భద్రపరిచారు. అనంతరంపరిస్థితులుఅనుకూలించడంతో ఉత్సవమూర్తిని తిరిగి ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఈ ధిల్లీ విజయోత్సవాన్ని ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.
చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ.శ. 1017–1137 మధ్యకాలంలో జరిగిన పరిణామాలకు గుర్తుగా ఈ ఉత్సవం కొనసాగుతుందని, అనంతర కాలంలో ఉత్సవమూర్తిని తిరిగి ఆలయంలో ప్రతిష్ఠించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఆచారం ప్రారంభమై నేటికీ కొనసాగుతోందని తెలిపారు. సుమారు 1961 నుంచి ఈ ఉత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో, స్థానాచార్యులు డా. డి.పి. రాజగోపాలాచార్యులు గారి పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీ సీతారామాచార్యులు, ఆలయ అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, నాదస్వర మంగళవాద్యాల మధ్య ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది.
ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షణాధికారి కె వెంకటేశ్వరావు పర్యవేక్షణలో అన్ని సౌకర్యాలను దేవస్థానం అధికారులు, సిబ్బంది సమకూర్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు, దేవస్థానం సిబ్బంది పాల్గొనగా, భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

Comments
Post a Comment