Skip to main content

మహిళలు ఐటీ, వైద్యం, విద్య, పరిపాలన, రక్షణ రంగాల్లో ఉన్నత అమలాపురం ఉద్యోగ మేళాలో 29 మందికి ఉద్యోగాలుస్థానాలు అధిరోహిస్తున్నా: జిల్లా రెవెన్యూ అధికారి వీర్ల సుబ్బారావు

.             SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...డా. బిఆర్ అంబేద్కర్  జిల్లా కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక ఉద్యోగ మేళాలో 29 మంది అభ్యర్థులు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి వీర్ల సుబ్బారావు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు పరిమిత రంగాలకే పరిమితమైన మహిళలు నేడు పరిశ్రమలు, ఐటీ, వైద్యం, విద్య, పరిపాలన, రక్షణ తదితర రంగాల్లో ఉన్నత స్థానాలు అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ముందుకు వచ్చిన మహిళా అభ్యర్థుల ధైర్యసాహసాలను అభినందించారు.


 వారికి ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులు కూడా ప్రశంసనీయులేనని అన్నారు. ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వర్తించి సంస్థలకు మంచి పేరు తీసుకురావడంతో పాటు కుటుంబ సభ్యులకు గర్వకారణంగా నిలవాలని సూచించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకుని ఇతర యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వికాస జిల్లా మేనేజర్ గొళ్ళ రమేష్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా వికాస ఆధ్వర్యంలో తరచూ ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ 


కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగలక్ష్మి, మేజిస్ట్రియల్ సెక్షన్ సూపరింటెండెంట్ రమణకుమారి, లీగల్ సెల్ సూపరింటెండెంట్ సుబ్బలక్ష్మి, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, వికాస సిబ్బంది పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...