లేఖర్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే ఆనందరావుకు వినతి పత్రం.... అమలాపురంలో దస్తావేజు లేఖర్లు 3వ రోజు నిరసన.... జివో 396ను ఉపసంహరించుకోవాలంటూ భారీ నినాదాలు...
అమలాపురం, విశాఖ సందేసం....స్థిరాస్తులు మరియు ఆస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సేవలు ప్రయివేటీకరణను రద్దు చేయాలని దస్తావేజు లేఖర్లు, సహయకులు, టైపిస్ట్ ల నిరసన మూడవ రోజు కొనసాగింది. జివో 396ను ఉపసంహరించుకోవాలంటూ లేఖర్లు
రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు బైఠాయించి భారీ నినాదాలు చేశారు. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా జి.ఓ. నెం.396 ను నిరసిస్తూ సమ్మెను నిర్వహిస్తున్నారు.. ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోతే నెల 31వరకూ సమ్మెను కొనసాగిస్తామని సీనియర్ లేఖరి సుబ్బు హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ సేవలు ప్రయివేటికరణ నిలుపుదల చేయాలని, దస్తావేజు లేఖర్లుకి లైసెన్సులు పునరుద్దీంచాలని మట్టపర్తి రాము కోరారు. ఎలాంటి వివాదాలు లేకుండా ప్రజలకు రిజిస్ట్రేషన్ తాలుకు సేవలను దస్తావేజు లేఖర్లు తమ తమ తరతరాల అనుభవంతో క్రయ విక్రయ దారులకు తమ సేవలను ప్రజలకు అందిస్తున్నామని గుంటూ ఫణి ప్రసాద్ అన్నారు.
బ్రిటిష్ కాలం నాటి నుండి కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ 396 జివో కారణంగా ప్రజలకి రిజిస్ట్రేషన్ జాప్యం, సమయం వృథా, మరియు అదనపు సొమ్ములను చెల్లించి నష్టపోవలసిన పరిస్థితులు ఏర్పాడతాయని దస్తావేజు లేఖర్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అమలాపురం దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్షులు జిన్నూరి సురేష్,కార్యదర్శి పందిరి హరి, జాయింట్ సెక్రటరీ పెద్దిరెడ్డి దుర్గేష్,, గనిశెట్టి బోగిరాజు, అడపా భూషణం, బొర్రా బుజ్జి, కడలి సత్యనారాయణ, డేగల రాజా, గోపాలం, సిరిపల్లి మూర్తి, పృథ్వి శ్రీను, గుమ్మల నరేష్, బండ్రెడ్డి రాజు, కె.వి. నాగరాజు తదితర లేఖర్లు, సహాయకులు, టైపిస్టులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.




Comments
Post a Comment