Skip to main content

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు* *గిరిజనులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? – జీవో నెం.3కు వెంటనే చట్టబద్ధత కల్పించాలి* *ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు, ఖనిజ దోపిడీని తక్షణమే నిలిపివేయాలి* *ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి డిమాండ్*

               SRINIVAS SPL Correspondant 


అల్లూరి సీతారామరాజు జిల్లా –అరకు వేలి నియోజకవర్గం -రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ముఖ్యంగా జీవో నెం.3కు చట్టబద్ధత కల్పించి గిరిజన నిరుద్యోగుల ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.


అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వేలి నియోజకవర్గంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ నిబంధనలను, 1/70 భూబదలాయింపు నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ గిరిజన ప్రాంతాల్లో హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఖనిజ తవ్వకాలు కొనసాగించడం గిరిజనుల భూములు, అడవులు, జీవన హక్కులపై తీవ్రమైన దాడి అని అన్నారు.

గిరిజనుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చేపడుతున్న అన్ని హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని, 1/70 చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న ఖనిజ తవ్వకాలను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.


అదేవిధంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రకటించిన హామీ మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్ల నియామకాన్ని వెంటనే చేపట్టాలని, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్–1లోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లు:

- జీవో నెం.3కు వెంటనే చట్టబద్ధత కల్పించాలి.

- గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలి.

- ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేయాలి.

- 1/70 చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న ఖనిజ తవ్వకాలను రద్దు చేయాలి.

- గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్లను వెంటనే నియమించాలి.

- అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్–1లోనే కొనసాగించాలి.

గిరిజనుల హక్కులు, భూములు, అడవులు, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని,

Comments