విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని : చట్టసభల్లో (పార్లమెంట్, అసెంబ్లీ) బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్య సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభలో డిమాండ్ చెయ్యడం పట్ల ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొణతాల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేసారు.రాజ్యసభలో శుక్రవారం ఆర్ కృష్ణయ్య చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై చేసిన ప్రసంగంపై కొణతాల శ్రీనివాస్ స్పందిస్తూ బీసీలకు కూడా రాజ్యాధికారం దక్కాలంటే చట్ట సభల్లో కూడా బీసీలకు 30% రిజర్వేషన్ కల్పించాలనేది తన అభిమతమన్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ కృష్ణయ్య కోరినట్లుగా బీసీలకు రాజ్యాధికారం, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.కుల గణన ను పరిగణనలోకి తీసుకుని బీసీ లకు 30% రిజర్వేషన్ కల్పించాలని కోరారు.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కుల గణనను ఆమోదించిందని గుర్తుచేశారు.ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం కుల గణన ఆధారంగా బీసీలకు 30% రిజర్వేషన్ కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. బీసీ లందరూ ఒకే తాటిపైకి వచ్చిన రోజున బీసీల తప్పకుండా రాజ్యాధికారం దక్కుతుందన్నారు.కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మాత్రమే బీసీ కార్డులు వాడడం ఎన్నికల తర్వాత పక్కన పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారంలా మిగిలిపోయిందన్నారు.బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే అన్ని బీసీ సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణతో ముందుకువెళ్లాలని కొణతాల శ్రీనివాస్ సూచించారు.

Comments
Post a Comment