సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల లో జర్మన్ భాషా సర్టిఫికెట్ కోర్సు విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)లోని ఎస్.జె.సి. లాంగ్వేజ్ సెంటర్ ఆధ్వర్యంలో 30 గంటల ఆన్‌లైన్ జర్మన్ భాషా సర్టిఫికెట్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. తెలిపారు. విదేశీ భాషల అభ్యాసం ద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆమె పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)లోని ఎస్.జె.సి. లాంగ్వేజ్ సెంటర్ ఆధ్వర్యంలో 30 గంటల ఆన్‌లైన్ జర్మన్ భాషా సర్టిఫికెట్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు
కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. తెలిపారు. విదేశీ భాషల అభ్యాసం ద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆమె పేర్కొన్నారు.
కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) మరియు మాజీ భాషల విభాగాధిపతి డా. పి. కె. జయలక్ష్మి మాట్లాడుతూ, జర్మన్ భాషను నేర్చుకోవడం ద్వారా ఉన్నత విద్య, బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు, అంతర్జాతీయ కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధికి విస్తృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కోర్సు విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు మరియు భాషా ప్రియులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె అన్నారు.
కోర్సు కోఆర్డినేటర్ శ్రీమతి వీణా స్పందన మాట్లాడుతూ, ఈ 30 గంటల ఆన్‌లైన్ కోర్సులో జర్మన్ అక్షరమాల, ఉచ్చారణ, రోజువారీ సంభాషణలు, ప్రాథమిక వ్యాకరణం, పఠనం, రచన, వినడం, మాట్లాడే నైపుణ్యాలతో పాటు జర్మన్ సంస్కృతి గురించి కూడా బోధించనున్నట్లు తెలిపారు. వారానికి మూడు రోజుల పాటు సాయంత్రం 7.00 నుంచి 8.00 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయని, కోర్సు ఫీజు రూ.1,500 మాత్రమేనని తెలిపారు. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్ ప్రదానం చేయబడుతుందని ఆమె వెల్లడించారు.
ఆసక్తి గల వారు వెంటనే నమోదు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/CCwSxBGcLTYLP77J7
మరిన్ని వివరాలకు: 9030272822, 7981032141, 6304910735.


Comments
Post a Comment