Skip to main content

సమనస గురుకుల పాఠశాలలో అంబారాన్నాంటిన మెగా పేరెంట్స్ డే 4. 0 కార్యక్రమం......

.            SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న కార్యక్రమం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డా. వై టి ఎస్ రాజు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్  డే 4.0 కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా ఎమ్. ఈ ఓ సూర్య ప్రకాష్,  పేరెంట్స్ కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న తల్లికి వందనం గురించి విద్యార్థుల తల్లిదండ్రుల వివరించారు.


ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు పిల్లలు ప్రవర్తన, వారి విద్యాబ్యాసంపై వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లను ఎంత దూరంగా ఉంచితే అంతా మంచిందని ప్రిన్సిపాల్ అన్నారు. 


పేరెంట్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే పదవ తరగతి పరీక్షలలో 100 శాతం ఉత్తిర్నత సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ  కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ తొత్తరమూడి ప్రసాద్,వైస్ ప్రిన్సి పల్ ప్రతాప్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...