Skip to main content

మృత్యుంజయుడు కారి చిన్నకి వాసుపల్లి రూ.40,000లు ఆర్థిక సాయం * మత్స్యకారుడి ప్రాణానికి కేవలం రూ.10 లక్షలు విలువ కడతారా? * జగన్ అధికారంలో ఉంటే కోటి పరిహారం ఇచ్చేవారు! * పేద ప్రజలంటే అంతా చులకన చంద్రబాబు? * మా మత్స్యకారుల ఉసురు తగలక తప్పదు.. * కూటమి ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ఫైర్..

.                   K.V.SHARMA EDITOR 
సముద్ర తీరంలో గల్లంతయిన 7గురు మత్స్యకారుల్లో ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్

కారి చిన్న కి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.40,000 లు సాయం చేశారు. షీలానగర్ కిమ్స్ ఆస్పత్రిలో 

చికిత్స పొందుతున్న అతనిని, కుటుంబ సభ్యులను వాసుపల్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. 

వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకున్నారు.

మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోటు డ్రైవర్ కారి చిన్నాను అటు కూటమినేతల నుంచి ఇటు ప్రభుత్వ అధికారుల వరకు పరామర్శ హడావిడి తప్ప అతనికి ఎటువంటి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రాలేదని ధ్వజమెత్తారు.

ప్రభుత్వం కూడా స్పందించి అతనికి ఆర్దిక సహాయం చేయకుండా తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

అదేవిధంగా బుధవారం నాడు గల్లంతేన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చిందని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు.

ఒక మత్స్యకారుడు ప్రాణానికి రూ.15 లక్షల రూపాయల విలువ కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 బాధిత మత్స్యకారుల కుటుంబ సభ్యులకు

చెక్కులు పంపిణీ చేసి బయటకు వెళుతున్న మంత్రి కొల్లు రవీంద్రను మత్స్యకారు కుటుంబాలు అడ్డుకున్నారన్నారు.

మాకు చెక్కులు వద్దు అంటూ కొందరు మంత్రి వద్దకు దూసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డు పడటం కూడా జరిగిందన్నారు.

 మత్స్యకార మహిళలు సైతం మంత్రి కారుకు అడ్డంగా నిలిచి తమ నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే

 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చేవారని చెప్పారు. కుటుంబ ప్రభుత్వం బాధ్యతగా మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో  జరిగిన అగ్ని ప్రమాదంలో కేవలం బోట్లు కాలిపోతే మొత్తం 49 మంది బాధిత కుటుంబాలకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి రూ.7.11 కోట్ల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సరిగా లేదని ధ్వజమెత్తారు. 

కేవలం అధికారం కోసం, ఆస్తుల సంపాదన కోసం మాత్రమే అధికారం చేపట్టినట్లు తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజాక్షేత్రంలో ఎండ గడతామని పేర్కొన్నారు.

ప్రజల తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో

జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు , జిల్లా జనరల్ సెక్రటరీ చోడిపిల్లి శివ,సౌత్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చింతపల్లి లీల కృష్ణ,మైలిపిల్లి  ఆనంద్,గనగళ్ల కామేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments