Skip to main content

టీచర్స్ తల్లిదండ్రుల కృషితో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు.... వన్నెచింతలపూడి ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ 4.0

                SRINIVAS SPL Correspondant 


అమలాపురం, విశాఖ సందేసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి/ సమనస  ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్  4.0 ను విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుబ్బల నాగ సత్యనారాయణ సమక్షంలో పి ఎమ్ సి చైర్మన్ ముత్యాల బాబు అధ్యక్షతన 


 అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా విద్యాశాఖ అధికారి గుబ్బల ప్రకాష్, జడ్పీటీసీ పందిరి హారి, ఎంపీపీ కూడుపూడి భాగ్యలక్ష్మి, 


మాజీ సర్పంచ్ నక్కా రాజరత్నా నాగవాణి ఎంపీటీసీ పరమట నాగమణి లు పాల్గొన్నారు. ఆటల పోటీలలో పిల్లల తల్లిదండ్రులు పలు గేమ్స్ లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికీ ప్రజాప్రతినిధులు బహుమతులను అందజేశారు. విద్యాశాఖ అధికారి ప్రకాష్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత ప్రతిష్టత్మాకంగా పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని,


 ఈ కార్యక్రమంలో తల్లితండ్రులు అందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎంపీపీ కూడుపూడి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టిందని, కార్యక్రమం ఉద్దేశ్యలను తల్లిదండ్రులు అవగాహన చేసుకుని పిల్లలు ప్రవర్తన నిషతంగా పరిశీలించలన్నారు. ప్రధానోపాధ్యాయులు గుబ్బల నాగ  సత్యనారాయణ మాట్లాడుతూ వన్నెచింతలపూడి ఉన్నత పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని దానికి సహకరిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయురాలు పాఠశాల ఉపాధ్యాయినిలు ఎన్.విజయలక్ష్మి, సీత ఆధ్వర్యంలో విద్యార్థినిలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను అందరూ వీక్షించి ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. పాఠశాల గ్రంథాలయంలో తెలుగు ఉపాధ్యాయులు బి.సత్యనారాయణ, 


ఎమ్.శ్రీనివాసరావులు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను అధికారులు, పెద్దలు సందర్శించి అభినందించారు. ఈ కారక్రమంలో పాఠశాల వైస్ చైర్ పర్సన్ వింజరపు పావని రూప చూడామణి,  ఉప సర్పంచ్ యర్రంశెట్టి వీరభద్రం, ఎంపీటీసీ సభ్యులు పరమట నాగమణి విష్ణుప్రసాద్, సమనస సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్, ఉప సర్పంచ్ మామిడిపల్లి దొరబాబు, ఎంపీటీసీ ఉడుము రామకృష్ణ దాత పాలాటి బాలయోగి, సత్తి రామచంద్రరావు, నడింపల్లి అర్జున్ వర్మ, మొసలి స్పర్జన్ రాజు, కుంచే వెంకటేశ్వరరావు, పరమట సురేష్, పరమట మోహన్ కుమార్, కందేరి వెంకటరమణ, కోడూరి రామమూర్తి, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...