*శ్రీ సత్యసాయి 5కే రన్ & రైడ్ గ్రాండ్ ఫినాలేకు నమోదు చేసుకున్న వారికి ఇన్డోర్ స్టేడియం లో జూలై 24, 25 తేదీల్లో టీ-షర్టులు, బిబ్ నంబర్ల పంపిణీ*
పుట్టపర్తి, జూలై 23:భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శత వర్ష జన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న "శ్రీ సత్యసాయి 5కే రన్ & రైడ్ – ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ" గ్రాండ్ ఫినాలే ఏర్పాట్లు శరవేగంతో జరుగుతున్నాయి. శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణ రావు జాతీయ సేవా కోఆర్డినేటర్ శ్రీ ఎస్ కోటేశ్వర రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ Ch. సురేంద్ర, రాష్ట్ర సేవా విభాగం జాయింట్ కోఆర్డినేటర్ శ్రీ విశ్వనాధ రెడ్డి , రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ శ్రీ సి గౌతమ్, ఇతర శ్రీ సత్య సాయి జిల్లా పదాధికారులతో కలిసి హిల్ వ్యూ స్టేడియం మరియు ఇన్డోర్ స్టేడియం లో ఏర్పాట్లను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ అఫ్ హయ్యర్ లెర్నింగ్ ఉపకులపతి(వైస్ ఛాన్సలర్) , రిజిస్ట్రార్లను కలిసి వారి సహాయ సహకారాలను కోరారు.
5కే రన్ మరియు 5కే సైకిల్ రైడ్‌కు నమోదు(రిజిస్టర్ ) చేసుకున్న 15 సంవత్సరాలు పైబడిన పాల్గొనేవారందరూ ఉచితంగా అందజేయనున్న ఈవెంట్ టీ-షర్టు మరియు బిబ్ నంబర్ను జూలై 24, 25 తేదీలలో ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు పుట్టపర్తిలోని ఇండోర్ స్టేడియం వద్ద కలెక్టు చేసుకోవాలి.
ఈవెంట్ టీ-షర్టు మరియు బిబ్ నంబర్ను తీసుకోవడానికి వచ్చే 5కే రన్ మరియు 5కే సైకిల్ రైడ్ రిజిస్టర్డ్ సభ్యులు (participants) తమతో గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ - ఆధార్ కార్డు వంటిది తీసుకురావాలి.
టీ-షర్టులు, బిబ్ నంబర్ల స్వీకరణకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సహాయం అవసరమైతే క్రింది వారిని సంప్రదించవచ్చు.
శ్రీ అనిల్ – 8897369392
శ్రీ రాజేంద్ర – 7411455705
అలాగే, జూలై 26 (ఆదివారం) జరిగే గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో పాల్గొనే వారందరూ ఉదయం 5.15 గంటలకల్లా శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియానికి చేరుకోవాలని, 5కే సైకిల్ రైడ్‌లో పాల్గొనే వారు తమ స్వంత సైకిళ్లను వెంట తీసుకురావాలని, కార్యక్రమ ప్రాంగణంలో సైకిళ్లు అందుబాటులో ఉండవని శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణ రావు తెలిపారు.
టీ-షర్టులు, బిబ్ నంబర్లను ముందుగానే జూలై 24, 25 తేదీలలో స్వీకరించి, నిర్ణీత సమయానికి 26 జూలై న కార్యక్రమానికి హాజరై ఈ మహోన్నత ఐక్యతా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణ రావు తెలిపారు.



Comments
Post a Comment