విమ్స్‌లో 'ట్రీస్ ఫర్ లైఫ్'తో 500కుపైగా మొక్కలు నాటే కార్యక్రమం* *క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్, జీవీఎంసీ, విమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ హరిత దినోత్సవ కార్యక్రమం*
. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం: ప్రపంచ హరిత దినోత్సవం సందర్భంగా క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్, జీవీఎంసీ, విమ్స్ సంయుక్తంగా బుధవారం విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో 'ట్రీస్ ఫర్ లైఫ్' పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాయి.
కార్యక్రమంలో భాగంగా విమ్స్ ప్రాంగణంలోని రహదారి డివైడర్లు, పరిపాలనా భవనం సమీపం తదితర ప్రాంతాల్లో 500కు పైగా పండ్ల, నీడనిచ్చే మొక్కలను నాటారు. నగరంలో పచ్చదనాన్ని పెంచడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, ఆసుపత్రి ప్రాంగణాన్ని మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా మార్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

జీవీఎంసీ అదనపు కమిషనర్ (పబ్లిక్ హెల్త్) పి. నల్లనయ్య తొలి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ మన్మథరావు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నల్లనయ్య మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడం, హరిత కార్యక్రమాలను నిరంతరం చేపట్టడం చాలా అవసరమన్నారు.
కార్యక్రమంలో భాగంగా విమ్స్ ప్రాంగణంలోని రహదారి డివైడర్లు, పరిపాలనా భవనం సమీపం తదితర ప్రాంతాల్లో 500కు పైగా పండ్ల, నీడనిచ్చే మొక్కలను నాటారు. నగరంలో పచ్చదనాన్ని పెంచడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, ఆసుపత్రి ప్రాంగణాన్ని మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా మార్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో VIMS డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ మరియు క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బయానా శ్రీనివాసరావు, క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్ చైర్మన్ వి. ధర్మేందర్, చాప్టర్ అధ్యక్షుడు ఈ. అశోక్ కుమార్, కార్యదర్శి వి. శ్రీను, జీవీఎంసీ హార్టికల్చర్ ఉప సంచాలకురాలు సి. జయ వాసుకి, కమిటీ సభ్యులు, సీనియర్ వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Comments
Post a Comment