Skip to main content

జీవీఎంసీలో 55 మంది ఉద్యోగుల ఉద్యోగ విరమణ. * ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు శేష జీవితం ఆనందంగా గడపండి. -జీవీఎంసీ వ్యయ పరిశీలకులు సి. వాసుదేవ రెడ్డి.

.               K.V.SHARMA EDITOR 
 విశాఖపట్నం, జూన్ 30: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో ఎంతో బాధ్యతగా సుదీర్ఘకాలం ఉద్యోగ విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న ప్రతి ఒక్కరి ఉద్యోగి శేష జీవితం ఆనందదాయకంగా ఉండాలని కోరుకున్నట్లు జీవీఎంసీ వ్యయ పరిశీలకులు( ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్) సి. వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ లో వివిధ హోదాలలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులను జీవీఎంసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. పద్మజ లతో కలిసి సన్మానించారు.


ఈ సందర్భంగా ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ కాలంలో తన కుటుంబము కంటే  అధిక కాలాన్ని సంస్థ కొరకు పని చేశారని పేర్కొన్నారు. నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న 55 మందిలో జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 కే. కిషోర్ కుమార్, పర్యవేక్షకులు బి. అప్పలరాజు, సహాయక ఇంజనీరు ఎం. సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్లు , రికార్డ్ అసిస్టెంట్,ఆఫీస్ సబార్డినేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, మజ్దూర్లు,మెకానికల్ విభాగం నుండి ఎస్. సాయిబాబు ,పిహెచ్ వర్కర్లు, వాచ్మెన్ లు, మినిమం టైమ్స్ కేర్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు  మొత్తం 55 మంది ఉద్యోగుల శేష జీవితాలు ఆనందదాయకంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులందరూ సుదీర్ఘకాలం జీవీఎంసీ కి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపకంతో ఆనందంగా జీవిస్తూ శేష జీవితం కుటుంబంతో ఆనందదాయకంగా ఉండాలని తెలిపారు.


అనంతరం ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ రూ.5,23,87,602/- వారికి అందించి పూలమాలలతో సత్కరించి, నూతన వస్త్రాలను బహుకరించి , జ్ఞాపికలను అందించి అభినందనలతో సన్మానించి సత్కరించారు.


ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి హర్ష వర్ధన్, జెమ్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎ .అప్పలరాజు , పర్యవేక్షకులు సన్నీ,పైడిరాజు, ఇతర జెమ్స్ యూనియన్ నాయకులు, జివిఎంసి ఉద్యోగులతో పాటు మాజీ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ.

Comments