Skip to main content

శ్రీ సత్యసాయి 5K రన్ & రైడ్‌కు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం

.                K.V.SHARMA EDITOR 
పుట్టపర్తి, జూలై 16: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో ఈ నెల 26న పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించనున్న "శ్రీ సత్యసాయి 5K రన్ & రైడ్ – ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ" కార్యక్రమానికి  శ్రీ సత్య సాయి  జిల్లా యంత్రాంగం నుంచి విశేష ప్రోత్సాహం లభించింది.


శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణ రావు  గారి నాయకత్వంలో, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీ కె. సూర్యనారాయణ మూర్తి గారు, రాష్ట్ర యువజన సమన్వయకర్త శ్రీ  సి  గౌతమ్ గారితో కూడిన ప్రతినిధి బృందం ఈ రోజు  జిల్లా కలెక్టర్ శ్రీ ఎ. శ్యామ్ ప్రసాద్, ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీ ఎం. మౌర్య భరద్వాజ్, ఐఏఎస్, అలాగే శ్రీ సత్యసాయి జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డీవో) కుమారి  పి. సువర్ణ గార్లను మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి సంబంధించిన అనుమతి పత్రం, అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీ ఎ. శ్యామ్ ప్రసాద్ గారు  యువతలో ఐక్యత, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానవతా విలువలు, జాతీయ సమైక్యతను పెంపొందించే ఈ మహత్తర కార్యక్రమాన్ని అభినందించి, కార్యక్రమం విజయవంతానికి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


అంతేకాకుండా, జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా జిల్లా విద్యాశాఖాధికారి (DEO) మరియు జిల్లా బీసీ సంక్షేమ అధికారి (DBCWO)లకు అవసరమైన సూచనలు జారీ చేస్తామని కలెక్టర్    శ్రీ ఎ. శ్యామ్ ప్రసాద్ గారు తెలిపారు.

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మీనారాయణరావు గారు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్‌డీవో గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా యంత్రాంగం నుంచి లభించిన ఈ సానుకూల స్పందన వేలాది మంది యువతను ఈ ఉద్యమంలో భాగస్వాములుగా చేసి, "ఒకే దేశం – ఒకే హృదయం – ఒకే ఆత్మ" అనే సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఆయన తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఘనవిజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.


Comments