శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. ఈ రోజు సాయంకాలం 7 గంటల నుండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు కొండ చుట్టూ విస్తృతంగా పర్యవేక్షణ నిర్వహించారు.
K.V.SHARMA EDITOR
ఈ రోజు సాయంకాలం 7 గంటల నుండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు కొండ చుట్టూ విస్తృతంగా పర్యవేక్షణ నిర్వహించారు.
ఈ పర్యవేక్షణలో భాగంగా కొండ చుట్టూ ఏర్పాటు చేసిన సేవా కేంద్రాలు, కంట్రోల్ రూమ్‌లోని డిప్యూటేషన్ సిబ్బంది హాజరు పరిస్థితిను పరిశీలించారు. సేవా కేంద్రాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాన్ని కూడా సమీక్షించారు.
అదేవిధంగా అప్పు ఘర్ ప్రాంతంలో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి టి. అన్నపూర్ణ పర్యవేక్షణలో భక్తులు సముద్రంలోకి వెళ్లకుండా ఏర్పాటు చేసిన జల్లు (బారికేడింగ్) ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల భద్రత దృష్ట్యా తీసుకున్న చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా అనే విషయాన్ని ఇఓ సమీక్షించారు.
తదుపరి కొండ చుట్టూ ఉన్న అన్ని సేవా కేంద్రాలను సందర్శించి, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ పర్యవేక్షణ కార్యక్రమం ద్వారా భక్తుల భద్రత, సౌకర్యాల నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.

Comments
Post a Comment